” అరవింద్ స్వామి లో ఇంత కౄరత్వం ఉందనుకోలేదు. అసలు అతనిలా చేస్తాడని నేను ఊహించలేదు కూడా అతనిలో ఒక విలన్ దాగున్నాడు. త్వరలో ఈ సంగతి ప్రపంచానికి తెలుస్తుంది” ఈమాటలన్నది ఎవరో కాదు అందాల నటి నయన తార. అరవింద్ స్వామి నటించింది కొన్ని సినిమాలే ఐనా ఈ పేరు మర్చిపోవటం కష్టమే 90లలో అమ్మాయిల కలల రాకుమారుడతను. రోజా లో అరవింద్ స్వామి అందానికీ మెరుపు కలలు సినిమలో అతని చార్మింగ్ లుక్ కీ బొంబాయిలో అరవింద్ స్వామి నటనకీ ఫిదా ఐపోయారు. మిస్టర్ పర్ఫెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే ఈ అందగాడు ఆ రోజుల్లో అమ్మాయిలకి హాట్ ఫేవరెట్ అయ్యాడు. నటుడిగానూ మంచి మార్కులే సంపాదించుకుని విమర్శకులతోనూ తో శబ్బాశ్ అనిపినిపించుకున్నాడు.
నటన అనేది తనకు ఇష్టం మాట్రమే డబ్బుకోసం నేను సినిమాల్లోకి రాలేదు అని చెప్పిన అరవింద స్వామి చాలా కాలం పాటు రొటీన్ పాత్రలు చేయలేనంటూ చాలా ఆఫర్లనే తిరస్కరించి తర్వాత అసలు సినిమాలకే దూరంగా ఉంటూ తన వ్యాపారం పై దృష్టి పెట్టాడీ బిజినెస్ మాన్. ఆ తర్వాత చాలాకాలం పాటు అరవింద్ స్వామి ని రోజా, బొంబాయి సినిమాల హీరో గానే గుర్తుంచుకున్న జనం. చాలా ఏళ్లకి ఒక మాగజైన్ లో అరవింద్ స్వామి ని చూసి షాక్ తిన్నారు విపరీతంగా లావెక్కి జుట్టూడిపోయి బట్టతలతో పొట్టతో కనిపించిన ఒకఫ్ఫటి తమ అభిమాన నటున్ని చూసి మూర్చ పోయినంత పనిచేసారు లేడీ అభిమానులు. ఒక యాక్సిడెంట్ వల్ల తీవ్రంగా గాయపడి కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోవలసి రావటం తో పెరిగిన బరువూ, వయసు రీత్యా వచ్చిన బట్ట తలా ఈ మిస్టర్ మ్యాన్ ని అంకుల్ లుక్ లోకి మార్చేసాయి.
ఐతే ఈ సంగతి అందరికీ తెలిసే లోపే బరువు తగ్గించుకొనీ, విదేశాల్లో హేయిర్ వీవింగ్ చేయించుకొనీ మళ్ళీ తన పాత అవతారం లోకి మారే ప్రయత్నం చేసి తన డైరెక్టర్ మణిరత్నం ద్వారానే “కడలి”తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ తన నటనతో అందర్నీ మెప్పించాడు. కడలి ఫ్లాప్ అయినా అరవింద్ స్వామి మళ్ళీ కనిపించటం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. కడలితో సహా ఇప్పటి వరకూ అరవింద్ స్వామి చేసినవన్నీ పాజిటివ్ పాత్రలే కానీ తర్వాతి సినిమాలో అతను క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తనీ ఒరువన్’లో అరవిందే విలన్ పాత్రధారి. రవి అన్నయ్య రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి నయనతార కథానాయిక ఆ సినిమా గురించి మాట్లాడుతూనే నయన్ పైన చెప్పిన మాటలన్నీ అంది. కొన్ని సన్నివేశాల్లో అరవింద్ స్వామి మొహం చూసి ఈ అమ్మడు భయపడిందట కూడా. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ చూస్తే విలన్ క్యారెక్టర్ చాలా బలంగా స్టైలిష్ గా ఉంటుందని.. అరవింద్ అదరగొట్టేశాడని అర్థమవుతోంది. అంతా ఓకే కానీ.. అరవింద్ ను విలన్ పాత్రలో చూసి నయనటారే తట్టుకోలేక పోయింది మరి తన లేడీ ఫాన్స్ సంగతేంటో. ‘తనీ ఒరువన్’ విడుదలయ్యాకే తెలుస్తుంది.