ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ కలిసి వర్క్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. మాటలనే ఆయుధాలను తయారు చేయడానికి ఒక కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి అంతటి పదునైన కత్తుల్లాంటి డైలాగ్‌లను దుయ్యగలిగేవాడు.. బల్లెంలా విసరగలిగేవాడు.. బాణాల్లా సంధించగలిగే వాడు ‘యంగ్ టైగర్’ ఎన్టీఆర్. మరి వీరిద్దరూ కలిస్తే, రం రుధిరం.. సమరం.. శిశిరం.. అంటూ వెండితెరపై కనిపించే ఆ మేజిక్కే వేరు. అందుకే ఈ కాంబినేషన్‌కు ఎంతో క్రేజ్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా చూడాలన్న సగటు అభిమాని కల నెరవేరడానికి పుష్కరకాలం పట్టింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంది? ఫ్యాక్షన్ సినిమాల హవా తగ్గిన నేపథ్యంలో ఆ జానర్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ ఏ మేరకు అలరించింది? త‌్రివిక్రమ్ మాటల పదును ఎలా ఉంది? వీర రాఘవుడిగా ఎన్టీఆర్ మరోసారి నట విశ్వరూపం చూపించారా?
‘అరవింద సమేత వీర రాఘవ’ నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయి 30 ఏళ్ల పాటు ఊళ్లను నాశనం చేస్తాయి. 12 ఏళ‍్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. కాని తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ఫ్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. అభిమానులు తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే డైలాగ్స్, ఎమోషన్స్‌తో పాటు, ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్‌ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్ కూడా తక్కువే.
తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా.. తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా లవ్ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, టేకింగ్ అలరిస్తాయి. ద్వితీయార్థం ఎమోషనల్ సీన్స్‌తో భారంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది. తమన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలతో రిలీజ్‌కు ముందే ఆకట్టుకున్న తమన్.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. పీఎస్ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఎన్టీఆర్ వీరరాఘవ ప్రాతకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇన్ని ఎమోషనల్ సీన్స్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయలేదు. తొలి ఇరవై నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే కనిపిస్తాడు. పూజా హెగ్డే పాత్ర కూడా కథలో కీలకమే. ఒక రకంగా కథానాయకుడి పాత్రలో మార్పు రావడానికి బలంగా దోహదం చేసింది. బాలిరెడ్డిగా జగపతిబాబును చాలా క్రూరంగా చూపించాడు ఆయన కూడా ఎక్కడా బోరింగ్ కొట్టకుండా నటించారు. ఈ సినిమాతో ఆయనకు మరో మంచి పాత్ర దొరికింది. నీలాంబరిగా సునీల్ ఆకట్టుకుంటాడు. తమన్ అందించిన సంగీతం బాగుంది. రం. రుధిరం.. పెనివిటి పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ విషయంలో తమన్ నూటి నూరు పాళ్లు న్యాయం చేశాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలం. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. త్రివిక్రమ్ తన శైలికి భిన్నమైన కథను ఎంచుకుని, దానికి తనదైన భావోద్వేగాలతో కూడిన మాటలను అందించడం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.వెండితెరపై కనిపించే ప్రతి చిన్న పాత్రనూ చాలా బలంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అందుకే ఏ పాత్రనూ ప్రేక్షకుడు అంత తర్వగా మర్చిపోలేడు.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
పంచ్ లైన్: అరవింద సమేత వీర రాఘవ.. ఫ్యాక్షన్ కథలో ఎన్టీఆర్ సవారీ
రేటింగ్ : 3/5
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.