Home / Entertainment / Video: నడి రోడ్డుపై హెలికాప్టర్‌ దించి అడ్రస్‌ అడిగిన పైలట్‌.

Video: నడి రోడ్డుపై హెలికాప్టర్‌ దించి అడ్రస్‌ అడిగిన పైలట్‌.

Author:

భారీగా మంచు కురుస్తున్న కజఖస్థాన్‌లో ఒక వింత సంఘటణ జరిగింది, ఆ దేశంలోని ఓ జాతీయ రహదారిపై ఒక్కసారిగా కజఖస్థాన్‌ ఆర్మీకి చెందిన ఎంఐ-80 హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది. మంచు దుప్పటి కప్పుకున్న రోడ్డూపై హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవడంతో ఏం జరుగుతుందో ఆ రోడ్డూపై వెళ్తున్న లారీ డ్రైవర్లకు అర్థం కాలేదు. అంతలోనే ఆ హెలికాప్టర్‌ నుంది దిగి ఆగిన లారీ డ్రైవర్‌ వద్దకు వచ్చాడు ఆ హెలికాప్టర్‌ పైలట్‌. భారి మంచు తూఫాను వలన దారి తప్పామని అక్తుబిన్సిక్‌ నగరానికి ఎలా వెళ్లాలో కొంచెం చెప్పమని పైలట్ అడగడంతో బిత్తరపోయాడు ఆ లారీడ్రైవర్‌. అంతలోనే తేరుకున్న లారీ డ్రైవర్ ఆ పైలట్ కి సరైన రూట్ చెప్పడంతో వెంటనే మరల హెలికాప్టర్‌ ను గాలిలోకి లేపాడు పైలట్.

ఈ సంఘటణ కు సంభందించిన వీడీయో బయటకి రావడంతో అదిప్పుడు వైరల్ గా మారింది. ఈ విషయంపై స్పందించిన కజఖస్థాన్‌ ఆర్మీ, ఇదంతా పైలట్ శిక్షణలో భాగమేనని వెళ్ళడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. విమానాలు, హెలికాప్టర్లు పక్కా ముందస్తూ ప్రణాళికతో వెళ్తాయని అందరికి తెలుసు కాని పైలట్ల కోచింగ్ కి ఇలాంటి పనులు చేయడం కొంచెం కొత్తగాను, వింతగాను ఉంది.

 

(Visited 2,529 times, 1 visits today)