Home / Latest Alajadi / ఈ ఆకును కాల్చి దాని పొగను పీల్చండి, రిలాక్స్ అయిపోతారు.

ఈ ఆకును కాల్చి దాని పొగను పీల్చండి, రిలాక్స్ అయిపోతారు.

Author:

మీకు అరోమాథెర‌పీ అంటే ఏంటో తెలుసా..? అరోమాథెర‌పీ అంటే సువాస‌న‌ల‌తో వ్యాధుల‌ను చేసే పద్దతి, ఈ పద్దతిలో మనసులని ప్రశాంతపరిచే సువాసనాలని మనం పీల్చేలా చేస్తారు, అప్పుడు మ‌న‌స్సుకు ప్ర‌శాంతంగా, హాయిగా అనిపిస్తుంది. రిలాక్సేష‌న్ క‌లుగుతుంది. దీంతోపాటు మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది, ఇలా అనేక మానసిక రోగాలని తగ్గిస్తున్నారు,  ఈ పద్ధతిని ఎక్కడో విదేశాల్లో కనిపెట్టలేదు మన దగ్గరే మన పూర్వికులు ఆయుర్వేద వైద్యంలో కనిపెట్టారు, కానీ ఈ పద్దతిని మనకంటే విదేశాలలోని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఈ అరోమాథెర‌పీని మనం మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మనం వంటలలో విరివిగా ఉపయోగించే బిర్యానీ ఆకుని ఉపయోగించి ప్రశాంతతని పొందవచ్చు, బిర్యానీ ఆకులో సువాసనని వెదజల్లే పోషకాలు ఉంటాయి, సాధారణంగా మనం బిర్యానీ రైస్ చేసేటప్పుడు ఈ ఆకులని ఉపయోగిస్తాం, అలాగే ఇంకొంతమంది ఈ ఆకులని వేడినీటిలో వేసుకొని స్నానం కూడా చేస్తారు, ఈ బిర్యానీ ఆకు మనకి అరోమాథెర‌పీలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

బిర్యానీ ఆకు

మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని ఒక గ‌దిలో పొగ వచ్చేలా కాల్చండి. ఈ స‌మ‌యంలో గ‌ది నుంచి బ‌య‌టికి వెళ్లి త‌లుపులు పెట్టేయండి. అలా ఒక 10 నిమిషాల పాటు అలాగే త‌లుపుల‌ను బంధించి ఉంచండి. దీంతో ఆ పొగ అంతా రూమ్‌లో వ్యాపిస్తుంది. అనంత‌రం రూమ్‌లోకి వెళ్లి చూడండి. చ‌క్కని సువాస‌న వ‌స్తుంది. ఆ సువాస‌న‌ను పీల్చితే మీ మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.కొద్దీ సమయం తరువాత ఒత్తిడి, ఆందోళ‌న అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గ‌ది అంతా సువాస‌నా భరితంగా ఉంటుంది. దోమ‌ల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి. ఈ పద్దతిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు.

(Visited 1,345 times, 1 visits today)