Home / Inspiring Stories / సబ్బు (Soap) కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

సబ్బు (Soap) కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

Author:

Santoor

ప్రతి రోజు మనం తప్పకుండ చేసే పనిలో స్నానం ఒకటి, స్నానం చేయాలంటే ఖచ్చితంగా సబ్బు లేదా బాడీ వాష్ ఉండాల్సిందే, శరీరం మంచిగా ఉండాలంటే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలి, అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి, సాధారణంగా ఎక్కువ మంది స్నానం చేయడానికి వివిధ రకాల సబ్బులని ఉపయోగిస్తారు, చాల మంది సబ్బులని టీవీలలో వచ్చే యాడ్స్ చూసి మరియు సబ్బుల నుండి వచ్చే సువాసనను చూసి కొంటారు, కాని మార్కెట్ లో ఉండే సబ్బులలో 70% సబ్బులు మన శరీరానికి హాని చేసేవే, కేవలం లాభాల కోసం మాత్రమే మా సబ్బులో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని ఇంకా ఆఫర్స్ కూడా ఇస్తాయి, సబ్బుల యొక్క నాణ్యతని నిర్ణయించడానికి టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది.

Santoor

  • మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్క సారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా? ఆ అదే! ఇప్పుడదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది.
  • అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం (TFM) అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం.
  • భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.
  • 76 అంతకు మించి శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు.

Santoor

  • గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది.
  • గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి.

Santoor

సో ఇప్పటి నుండి అయిన సబ్బుల యాడ్స్ ని లేదా సువాసనని కాకుండా సబ్బు ప్యాకెట్ పై ఉన్న TFM శాతాన్ని చూసి కొనండి.

Must Read: వైఫై స్లోగా ఉందా బీరు బాటిల్ తో స్పీడు పెంచుకోవచ్చు.

(Visited 16,834 times, 1 visits today)