Home / Inspiring Stories / అపరిచితులలో కూడా సాయం చేసే హీరోలుంటారు, సాటి మనుషులను నమ్మండి.

అపరిచితులలో కూడా సాయం చేసే హీరోలుంటారు, సాటి మనుషులను నమ్మండి.

Author:

నగరం నిద్రపోతూంటుంది… మనం కూడా వెచ్చని దుప్పట్లో నిర్భయంగా, హాయిగా… మనమూ నిద్రపోతూంటాం. అయితే మనం ఇంత హాయిగా నిద్ర పోతున్న సమయం లో మీ రేపటి రోజు నగర ప్రయాణం ఆనందంగా ఉండేందుకు రోడ్లు ఊడుస్తూంటారు కొంతమంది. అర్థ రాత్రి నిద్రమత్తులో వచ్చే మీ సన్నిహితులకు ఏ ప్రమాదమూ జరగ కూడ దని తమ నిద్ర వదిలేసుకొని డ్యూటీ చేస్తూంటాడొక ట్రాఫిక్ కానిస్టేబుల్.., ఉదయమే మీకు అసౌకర్యం కలగకుండా పల్లెలో పాలని నగరం లోకి చేరుస్తాడొక డ్రైవర్… ఔను…! చీకట్లో తిరిగే వారంతా చెడ్డవాళ్ళు కాదు.

 ఔను..! కొన్ని సంఘటనల వల్ల మనం అర్థ రాత్రి కనిపించే ఒక అపరిచితున్ని చూసి భయపడతాం, మనకు హాని చేస్తాడేమో అనుకుని అనుమానిస్తాం. సొంత ఇంట్లోనే రక్త సంబందీకులే ప్రాణాలు తోడే సమాజం లో బతికే మనం ఒక పరిచయం లేని మొహాన్ని చూసిభయపడటంలో వింతేమీ లేదేమో కానీ…! ప్రతీ వారినీ చెడ్డ వారిగానే చూడలేం… ఏమొ ఆ క్షణాని ఆ అపరిచితుడే మన ప్రాణాలు కాపాడ వచ్చు మీరు జీవితాంతం మర్చిపోలేని ఒక అద్బుతమైన ఙ్ఞాపకాన్ని మీకివ్వవచ్చు. ఎవరూ దగ్గరలో లేకుండా మీరు నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మీకు సహాయం చేసిన ఆ లైం లైట్ హీరోస్ ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక సమయం లో మన అందరి జీవితాల్లోనూ వచ్చేఉంటారు… అదే విసయాన్ని చెబుతూ..ఈముగ్గురి జీవితాల్లోనూ కనిపించిన ఆ నిజమైన మనుషులని మనముందుకు తెచ్చేలా తీసిన వీడియో మిమ్మల్ని కొద్దిసేపు… పాత ఙ్ఞాపకాల్లోకి తీసుకు వెళుతుంది. కొన్ని సార్లు ఆ లైం లైట్ హీరో మీరు కూడా అయ్యుండోచ్చు.. ఈ వీడియో చూసాకా ఇటువంటి అనుభవం మీకేపుడైనా ఎదురైతేమాత్రం… కింద కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి..

మీరెవరికైనా సాయపడ్డా… లేదా మీకెవరైనా అలాంటి పరిస్థితుల్లో సాయం చేసినా.. మాతో ఆ ఙ్ఞాపకాన్ని పంచుకోండి.

(Visited 185 times, 1 visits today)