Home / Inspiring Stories / ఏడేళ్ళ వయసులోనే ఆపరేషన్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ఏడేళ్ళ వయసులోనే ఆపరేషన్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

Author:

7 ఏళ్ల వయసులో వయసులో అయితే మనం ఒకటో లేదా రెండో తరగతిలో కూర్చొని ఎ,బి,సి,డి లను దిద్దుకుంటూ ఉంటాం, కాని హిమాచల్ ప్రదేశ్ కి చెందినా అర్కిత్ జైస్వాల్ అనే కుర్రాడు ఏడేళ్ళ వయసులోనే విజయవంతంగా సర్జరీ చేసి ప్రపంచంలోనే అతి చిన్న వయసులో శస్త్రచికిత్స చేసినట్టు రికార్డు సృష్టించాడు.

at-the-age-of-7-this-kid-is-the-youngest-surgeon-in-the-world

అర్కిత్ జైస్వాల్ పుట్టింది హిమాచల్ ప్రదేశ్ లోని నుర్ర్పూర్ అనే ఊర్లో, చిన్నతనం నుండే అర్కిత్ చాలా చురుగ్గా ఉండేవాడు, పది నెలల వయసులోనే నడవడం, 5 ఏళ్ల వయసులోనే నవలలను, బయాలజీ పుస్తకాలను చదవడం చేయడం చూసి అందరు ఆశ్చర్యపోయారు, అర్కిత్ ఐక్యు స్థాయి మేధావులతో సమానంగా ఉండేది.అర్కిత్ జైస్వాల్ చిన్నప్పటి నుండి శరీర నిర్మాణానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఆసక్తి ని కనబరిచేవాడు, అర్కిత్ ఆసక్తిని గమనించిన చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ అర్కిత్ ని అప్పుడప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి సర్జరీ విధానాన్ని చూపించేవారు, అలా అర్కిత్ శస్త్రచికిత్సకి సంబంధించిన విషయాలను ఆరేళ్ళ వయసులోనే నేరుచుకున్నాడు.

ఒక రోజు ఒక పేద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి కాలి వేళ్ళు, చేతి వేళ్ళు ప్రమాదవశాత్తు కాలిపోయి అతుక్కుపోయాయి, వారికి ఆపరేషన్ చేయించుకునే ఆర్ధిక స్తోమత లేదు, అర్కిత్ ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పి, కొంతమంది పెద్ద డాక్టర్ల పర్యవేక్షణలో 2000వ సంవత్సరం నవంబర్ 19th రోజున ఆపరేషన్ విజయవంతంగా చేసి అతుక్కుపోయిన ఆ అమ్మాయి కాలి, చేతి వేళ్ళను విడదీసాడు. ఈ ఆపరేషన్ చేసే సమయానికి అర్కిత్ వయసు ఏడేళ్ళు మాత్రమే.ఈ ఆపరేషన్ తో అర్కిత్ పేరు వైద్య విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఏడేళ్ళ వయసులోనే ఆపరేషన్ చేసి ప్రపంచలో అతి చిన్న వయసులో ఆపరేషన్ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

బి.అర్. రహి అనే విద్యావేత్త సహకారంతో అర్కిత్ 12 ఏళ్ళ వయసులోనే పంజాబ్ యూనివర్సిటీ నుండి వైద్య శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తరువాత ఐఐటి కాన్పూర్ లో బయోఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నాడు, ప్రస్తుతం అర్కిత్ జైస్వాల్ వయసు 23 సంవత్సరాలు ఇప్పుడు కాన్సర్ ని నయం చేయడం పై అంతర్జాతీయ నిపుణులతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు.

(Visited 11,099 times, 1 visits today)