Home / Latest Alajadi / ATM విత్ డ్రాలపై చార్జీల మోత…! ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!

ATM విత్ డ్రాలపై చార్జీల మోత…! ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!

Author:

బ్యాంకులో డబ్బులు వేసిన..తీసిన..మినిమమ్ బ్యాలన్స్ లేకున్నా, ఏటీఎం నుండి విత్ డ్రా చేసుకున్న చార్జీల రూపంలో బాదడానికి అన్ని బ్యాంకులు రంగం సిద్ధం చేసాయి, . అత్యవసరం అయినా సరే.. మన డబ్బుని మనం తీసుకోవటానికి అయినా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు, మనం కష్టపడి సంపాదించిన డబ్బే అయినా వాటిని వాడుకోవాలంటే మాత్రం చార్జీలు చెల్లించాల్సిందే అనేట్లుగా సరికొత్త నిబంధనలని బ్యాంకులు ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయబోతున్నాయి.

ఖాతాలో మినిమమ్ బ్యాలన్స్ లేకుంటే ఫైన్ కట్టాల్సిందే అని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి, బ్యాంకులలో జరిగే లావాదేవీలపై ఇప్పటికే చార్జీలను కొన్ని ప్రైవేట్ బ్యాంకులలో వసూలు చేస్తున్నారు, SBI బ్యాంకులలో కూడా ఏప్రిల్ ఒకటి నుండి చార్జీలు వసూలు చేయనున్నారు, ఇది ఇలా ఉండగానే ఏటీఎం ల ద్వారా జరిగే లావాదేవీలపై కూడా చార్జీలు వసూలు చేయనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి.

atm-charges-for-with-drawing

ప‌రిమితికి మించి ATM ట్రాన్సాక్ష‌న్స్ చేస్తే ఫైన్ రూపంలో కొర‌డా ఝుళిపించేందుకు రెడీ అయ్యాయి ఆయా బ్యాంకులు. వారానికి రూ.50వేలు మాత్ర‌మే ATM నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకునేలా అన్ని బ్యాంకులు ఒకే నిబంధ‌న‌ను అమ‌లు చేశాయి. బాదుడులోనూ ఒక్కతాటిపైకి వచ్చాయి. హోం బ్రాంచ్ ATM కదా అని ఇష్టానుసారం వాడినా సరే..చార్జీల రూపంలో వాత పెడతామంటున్నాయి.

ATM లావాదేవీలపై ముఖ్య బ్యాంకులు ప్రకటించిన నిబంధనలు ఇవే….

  • ATM ద్వారా 5 సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరపవచ్చు.
  • 5 కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే ప్రతి లావాదేవిపై SBI ఖాతాదారుల నుండి రూ.10 , మిగిలిన బ్యాంకుల (HDFC , ICICI , AXIS ..etc ) ఖాతాదారుల నుండి రూ.20 చార్జీల రూపంలో వసూలు చేస్తారు.
  • ఖాతా ఉన్న బ్యాంకు ATM లలో 5 సార్లు ఉచితం, వేరే బ్యాంకు ATM లలో అయితే 2 సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరపవచ్చు.
  • ATM ల ద్వారా వారానికి రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు.
  • ఇతర బ్యాంక్ నుంచి మూడో ట్రాన్సాక్షన్ కింద రూ.100 తీసుకున్నా.. 20 రూపాయల చార్జ్ వసూలు అవుతుంది. అంటే 100 రూపాయలకు.. 120 కట్ అవుతుంది.
  • ఈ నిబంధనలు అన్ని ఏప్రిల్ ఒకటి నుండి అమలులోకి రానున్నాయి.
  • ATM కనిపించింది కదా అని రూ. 100 , 200 విత్ డ్రా చేయాలంటే ఫైన్ కట్టాల్సిందే ఒకేసారి ఎక్కువమొత్తంలో విత్ డ్రా చేసుకుని వాడుకుంటే చార్జీలు బారి నుండి బైట పడొచ్చు.

Also Read: ఏప్రిల్ 6 న “నో ట్రాన్సక్షన్ డే” పేరుతో బ్యాంకులపై పోరాటం..!

(Visited 2,332 times, 1 visits today)