Home / Entertainment / డ్రైవర్‌ లేకుండా వెళ్లిన రైలు… చివరికేమైందో తెలుసా?

డ్రైవర్‌ లేకుండా వెళ్లిన రైలు… చివరికేమైందో తెలుసా?

Author:

డ్రైవర్‌ లేకుండా దాదాపు 1100కిలోమీటర్ల ప్రయాణించిన గూడ్స్‌ రైలు ఆ తర్వాత పట్టాలు తప్పింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో సోమవారం చోటుచేసుకుంది. పెద్ద మొత్తంలో ఇనుప ధాతువును తరలిస్తున్న నాలుగు ఇంజిన్లు, 268 వ్యాగన్లు గల రైలు సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమన్‌ నుంచి పోర్ట్‌ హెడ్‌ల్యాండ్‌కు బయలుదేరింది.

అయితే తెల్లవారుజామున 4.40 సమయంలో పోర్ట్‌హెడ్‌ ల్యాండ్‌కు ఇంకా 210దూరంలో ఉండగా డ్రైవర్‌ రైలును ఆపి కిందకు దిగి ఓ వ్యాగన్‌ను పరీక్షిస్తుండగా రైలు దానంతట అదే ముందుకు కదిలింది.ఈ సమయంలో రైలు ఆటోమెటిగ్గా పట్టాలు తప్పి.. గంట సేపు దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

australia-train-travels-without-driver-hour

అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ కొన్ని రైళ్లు, 1,500 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నదని సమాచారం.ప్రస్తుతం బీహెచ్‌పీ సిబ్బంది ఈ ట్రాక్‌ను బాగు చేసే పనిలో ఉన్నారు.ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

(Visited 1 times, 1 visits today)