Home / health / భోజనం తరువాత అస్సలు చేయకూడని పనులు తెలుసుకోండి.

భోజనం తరువాత అస్సలు చేయకూడని పనులు తెలుసుకోండి.

Author:

భోజనం చేసిన తరువాత మనం చాలా పనులు చేస్తుంటాం, వాటిలో కొన్నింటిని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండవచ్చు, భోజనం చేసిన తరువాత మనం ఖచ్చితంగా  చేయకూడని వాటి గురుంచి తెలుసుకోండి.

1.సిగరేటు తాగరాదు:

భోజనం చేసిన తరువాత సిగరెట్ తాగకూడదు, తిన్న తరువాత తాగే సిగరెట్ 10 సిగరెట్లతో సమానం, ఆ సమయంలో తాగితే కాన్సర్ వచ్చే ఆవకాశాలు ఎక్కువ ఉంటాయి.

2.టీ తాగరాదు:

survey-revealed-reasons-for-smoking

మాములుగా టీ తాగితే వెంటనే శరీరంలో ఆసిడ్ విడుదల అవుతుంది, భోజనం చేసిన తరువాత టీ తాగడం వల్ల విడుదల అయిన ఆసిడ్ వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సరిగ్గా జరగదు.

3.స్నానం చేయకూడదు:

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. చేస్తే రక్తం అంతా కాళ్లకు, చేతులకు మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి. జీర్ణపక్రియని నెమ్మది చేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్ధ సామర్ధ్యం తగ్గిపోతుంది.

4. నిద్ర పోకూడదు:

భోజనం చేసిన వెెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్టిక్, ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు పడుకొని లేవటం మంచిది.

5.పళ్లు తినకూడదు:

మాములుగా పళ్ళు తొందరగా జీర్ణం అవుతాయి, భోజనం కొంచెం ఆలస్యంగా జీర్ణం అవుతుంది, భోజనం తిన్న తరువాత పళ్ళు తింటే రెండు కలిసిపోయి జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు. అందుకే భోజనం చేసిన వెంటనే పళ్ళు తినకూడదు.

మన తాతల కాలంలో వాళ్ళు ఏ సమయానికి ఏం తినాలో వాటినే తినేవారు అందుకే వారు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండేవారు, మనం కూడా అలా చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు  సగం రోగాలు మన దగ్గరికి రావు, అందరికి తెలియజేయండి.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 32,620 times, 1 visits today)