ఇంతకీ ఈ వయసులో రమ్యకృష్ణ కు, మోహన్ బాబు కు మధ్య నడుస్తున్న కెమిస్ట్రీ ఏమిటి? ఆయనేమన్నారు? ఆవిడ ఎందుకంత మురిసిపోతోంది? మొత్తానికి ఆ గదిలో ఏదో జరుగుతోంది. అంతా స్టిల్ ఫోటోల రూపం లో ఉండటంతో , ఎవరూ ఏమీ గెస్ చేయలేని పరిస్థితి. అల్లరి నరేష్, పూర్ణ జంట గా నటిస్తున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమా వర్కింగ్ స్టిల్స్ ఇవి. ఇందులో మామ కచ్చితంగా మోహన్ బాబే కాబట్టి, అత్త గారు రమ్య కృష్ణే ..సందేహమేమీ అక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రోగ్రెస్ లో ఉన్నట్టు తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసిన రమ్యకృష్ణ , పని లో పనిగా ఫోటోలు కూడా ఎటాచ్ చేసింది.
మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అల్లరి మొగుడు’. వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్‌ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన వాటిలో ‘అల్లరి మొగుడు’కి ప్రముఖ స్థానమే ఉంటుంది. సిల్వర్‌జూబ్లి సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు గుర్తుచేయడానికి కారణం ఉంది. మరోసారి మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ వెండితెరపైకి రానుంది.
23 ఏళ్ల తర్వాత ఈ త్రయం మళ్లీ మేజిక్ చేయబోతున్నారు. ఈసారి ఈ కాంబినేషన్‌కి ‘అల్లరి’ నరేశ్ తోడయ్యారు. నరేశ్ సరసన పూర్ణ కథానాయికగా నటించనున్నారు. సినిమా పేరు ‘మామ మంచు… అల్లుడు కంచు’. టైటిల్ రోల్స్ లో మోహన్ బాబు, ‘అల్లరి’ నరేశ్ నటించనున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడు.