Home / Entertainment / బాహుబలి ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.

బాహుబలి ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.

Author:

బాహుబలి సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది, మరో రెండు రోజుల్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోనుంది, ఒక తెలుగు సినిమాగా మొదలై మన దేశంలోనే బిగ్గెస్ట్ సినిమాగా బాహుబలి నిలిచింది, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా అనేక రికార్డులని సృష్టించింది, మొదటి పార్ట్ విడుదల సమయంలో తెలుగు రాష్ట్రాల వరకే అంచనాలు ఉండేవి అయిన కూడా దేశం మొత్తం బాహుబలి సినిమా మేనియానే నడిచింది, ఇప్పుడు దేశం మొత్తం బాహుబలి ది కంక్లూజన్ కోసం ఎదురుచూస్తుంది, భారీ అంచనాల మధ్య వస్తున్న బాహుబలి సినిమా కలెక్షన్ల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవడం ఖాయమనే భావిస్తున్నారు. ఈ చిత్రానికి జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.

బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్.

కేవలం తెలుగు రాష్ట్రాల వరకే బాహుబలి ది కంక్లూజన్ సినిమాని దాదాపు రూ.130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు, మిగతా భాషలు.. రాష్ట్రాల సంగతి చూస్తే.. కర్ణాటకకు రూ.36 కోట్ల అడ్వాన్స్ తో బయ్యర్ హక్కులు సొంతం చేసుకున్నాడు. తమిళనాడు రైట్స్ రూ.47 కోట్లు పలికాయి. కేరళ రైట్స్ రూ.11 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇండియాలో మిగతా రాష్ట్రాలన్నింటికీ కలిపి రైట్స్ రూ.70 కోట్ల మేర అడ్వాన్స్ తో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఉత్తర అమెరికా మొత్తానికి కలిపి రూ.44 కోట్ల దాకా బిజినెస్ చేసింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. మిగతా దేశాల్లో ‘బాహుబలి-2’ ఇండియన్ వెర్షన్ హక్కుల్ని రూ.20 కోట్లకు అమ్మారు. కొన్నాళ్ల తర్వాత పలు దేశాల్లో ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు.

అన్ని భాషలు, దేశాలు కలిపి బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.350 కోట్లని దాటిపోయింది, ఇంకా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ అమ్మలేదు, బాహుబలిని ఇంకా అనేక రకాలుగా మార్కెట్ చేస్తున్నారు. ఆ లెక్కలన్నీ కలిపితే రూ.500 కోట్లు ఈజీగా దాటిపోతాయి, బాహుబలి రెండు పార్టులకి కలిపి నిర్మాతలు దాదాపు రూ.450 కోట్లు ఖర్చు పెట్టారు, బాహుబలి మొదటి పార్టుతో దాదాపు రూ.650 కోట్లు వసూళ్లు కొల్లగొట్టారు, బాహుబలి ది కంక్లూజన్ తో రూ.1000 కోట్ల వసూళ్ళని సాధించాలని బాహుబలి అభిమానులు కోరుకుంటున్నారు.

(Visited 1,033 times, 1 visits today)