Home / Entertainment / Video: శివాలెత్తించిన బాహుబలి 2 – ది కంక్లూసన్ ట్రైలర్

Video: శివాలెత్తించిన బాహుబలి 2 – ది కంక్లూసన్ ట్రైలర్

Author:

దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాహుబలి2 ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి మొదటి భాగం సృష్టించిన రికార్డుల వల్ల రెండో భాగమైనా ఈ సినిమాపై భారి అంచాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే బాహుబలి 2 – ది కంక్లూసన్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటొంది. ముందుగా మీరు కూడా ట్రైలర్ పై లుక్కేయండి.

అమరేంద్ర బాహుబలి పట్టాభిషేకం డైలాగుతో మొదలైన ట్రైలర్ లో వెంటనే కట్టప్ప బాహుబలి పొడిచే సన్నివేశాన్ని చూపారు. ఆ తరువాత శివగామి ని ఓ క్షణం పాటు చూపి బాహుబలి, దేవసేన ల యుద్ధ పాటవాలను చూపించారు. ఆ తరువాత మిగతా క్యారక్టర్లను చూపుతూ కథను కొంచెం రివీల్ చేసే ప్రయత్నం చేసారు. గ్రాఫిక్ ఎఫెక్టులు, నేపద్య సంగీతం ఆకట్టుకున్నాయి. మొత్తానికి బాహుబలి 2 – ది కంక్లూసన్ ట్రైలర్ ఇన్నాళ్ళు వేచి చూసిన అందరి అభిమానుల ఆకలి తీర్చింది.

(Visited 1,611 times, 1 visits today)