Home / Entertainment / వెయ్యి కోట్ల బాహుబలి.

వెయ్యి కోట్ల బాహుబలి.

Author:

భారత దేశ సినీ చరిత్రలో మన బాహుబలి సినిమా సరికొత్త చరిత్రని సృష్టించింది, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది, అది కూడా కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా ఇంత ఘనత సాధించడం విశేషం. భారత దేశంలో అన్ని భాషలలో కలిపి 800 కోట్ల గ్రాస్ , అమెరికా మరియు ఇతర దేశాలలో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ లని కొల్లకొట్టి వెయ్యి కోట్ల క్లబ్ లో బాహుబలి చేరిపోయింది.

బాహుబలి కలెక్షన్స్

ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం గురుంచి ఎవ్వరు ఉహించివుండరు, తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ కి దీటుగా బాలీవుడ్ లో బాహుబలి కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది, సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్ , షారుక్ ఖాన్ సినిమాలని మించిన కలెక్షన్స్ తో హిందీలోను దుమ్మురేపుతుంది, ఇప్పటివరకు హిందీలో దాదాపు 270 కోట్ల షేర్ ని సాధించి 300 కోట్ల దిశగా దూసుకెళ్తుంది, తెలుగులో మొదటివారంలోనే 150 కోట్లు కొల్లగొట్టింది, ఇప్పటికే అన్ని ఇండియన్ సినిమాల కలెక్షన్స్ ని దాటేసి చరిత్ర సృష్టించిన బాహుబలి మరిన్ని రోజులలో ఇంకెన్ని రికార్డులు సృష్టింస్తుందో చూడాలి.

(Visited 619 times, 1 visits today)