Home / Entertainment / బాహుబలి కోసం ఒక ఉద్యోగి తన బాస్ కి రాసిన వెరైటీ లీవ్ లెటర్.

బాహుబలి కోసం ఒక ఉద్యోగి తన బాస్ కి రాసిన వెరైటీ లీవ్ లెటర్.

Author:

మరో కొన్ని గంటల్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది అందరికి తెలిసిపోతుంది, అందరి కంటే ముందే బాహుబలి సినిమాని చూడాలని చాలామంది కష్టపడి మొదటిరోజు టికెట్ లని సంపాదించారు, బాహుబలి సినిమాని మొదటిరోజే చూడటం కోసం చాలామంది తమ ఆఫీస్ లకి సెలవులు కూడా పెట్టేసారు, అలా ఒక ఉద్యోగి తన బాస్ కి బాహుబలి కోసం లీవ్ ఇవ్వాలంటూ ఒక లీవ్ లెటర్ రాసాడు, ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ఆ లెటర్ మీకోసం..

leave leater for wathing bahubali movie

       సెల‌వు ప‌త్ర‌ము

తేదీ 27.04.2017

గౌర‌వ‌నీయులైన సీఈవో గారికి,

విష‌యం : విడుదల రోజు  బాహుబ‌లి-2 సినిమా  చూడ‌డానికి శుక్రవారం సెల‌వు  గురించి.

నేను మీ కంపెనీలో ప‌నిచేసే స‌గ‌టు ఉద్యోగిని. నాకు ఈ శుక్ర‌వారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబ‌లి సినిమా చూపించ‌డం కోసం. సినిమా చూడ‌డానికి సెల‌వెందుకు అని మీర‌డ‌గ‌వ‌చ్చు. కానీ ఈ సినిమా చూపించ‌క‌పోతే  నా ఫ్యామిలీ నాకు  ద‌క్కేట్టు లేదు.

  • నా కొడుకు గ‌డికోసారి నేనెవ‌ర్నీ…. నేనెవ‌ర్నీ… అని అరుస్తున్నాడు.
  • నా కూతురు జై మాయుష్మ‌తీ అంటూ నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తుంది.
  • నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మ‌తికి మ‌కిలి ప‌ట్టిందీ…. ర‌క్తంతో క‌డిగేయ్‌… అంటూ దిక్కులు పెక్క‌టిల్లేలా అరుస్తుంది.
  •  నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక  డ్రీమ్స్ లోకి  వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్)
  • నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ  ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెేయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది.
  • సినిమా చూడగానే ప్రతి ఒక్కడు వచ్చి “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేస్తుంటారు..” అది విని నేను సహించలేను. సో..నేనే తెలుసుకుంటా!
  • దేవసేన మహారాణి (అనుష్క) ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది (ఇది పర్సనల్)

సార్ ఇక నా వల్ల కాదు….ఆ మోషన్ పిక్చర్ చూపించ‌క‌పోతే మావాళ్లు నాకు మోష‌న్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవ‌త్స‌రాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్.

కాబ‌ట్టి పై విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం  సెల‌వు ఇవ్వ‌గ‌ల‌ర‌ని నా మ‌న‌వి.

                                                                                                                                         కృత‌జ్ఞతాభినంద‌న‌ల‌తో…
మీ విధేయుడు అమ‌రేంద్ర బాహుబ‌లి
సారీ… స‌ర్ సినిమా సీను.

(Visited 5,246 times, 1 visits today)