Home / Entertainment / బాహుబలి 2ని క్లైమాక్స్ వరకు చెక్కేసిన జక్కన్న..!

బాహుబలి 2ని క్లైమాక్స్ వరకు చెక్కేసిన జక్కన్న..!

Author:

టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి ఏ ముహూర్తాన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడో కానీ అతను ఏం పట్టుకున్నా బంగారమే. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్లు. అమాంతంగా హీరో కెరీర్ ను టాప్ లెవెల్ కి తీసుకుపోగల స్టామినా జక్కన్నది. బాహుబలి ముందు వరకు తెలుగు సినిమా వరకే పరిచియం ఉన్న రాజమౌళి బాహుబలితో మొత్తం ప్రపంచానికే మరోసారి తెలుగు సినిమా గొప్పదనాన్ని చూపించాడు, మనముందు గొప్పలు పోయే తమిళ తంబిలు, బాలీవుడ్ దిగ్గజాలతో సైతం ఔరా రాజమౌళి అనిపించుకుని తనదైన శైలిలో అప్పటి వరకూ ఉన్న రికార్డులను ఒక్క పెట్టున తుడిచిపెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి మేకింగ్ స్టాండర్డ్స్ చాలా వరకూ పెంచేసాడు, మనం కూడా కలక్షన్ల వర్షం కురిపించటంలో ఏ మాత్రం తక్కువ కాదని నిర్మాతలకి బరోసా ఇచ్చాడు.

Why Kattappa Killed Baahubali

బాహుబలిని చూసిన తర్వాత సీక్వెల్గా వస్తున్న బాహుబలి 2ని జక్కన ఎప్పుడు వడ్డిస్తాడా అని అటు ఇండస్ట్రీ, ఇటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాలు జక్కన ఇచ్చిన ట్విస్ట్ ఏమయి ఉంటుందా ? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అని ఎవరి ఊహలతో వాళ్ళు మతులు పోగొట్టుకుంటున్నారు .

Baahubali Shooting Update

ఇది ఇలా ఉండగా జక్కన్న కూడా అప్పుడప్పుడూ సినిమా గురించి అప్డేట్లు ఇస్తూ జనాలని ఊరిస్తూనే ఉన్నాడు, జనాలు కూడా అలా జక్కన్న ట్వీట్ చేసినప్పుడో, ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడో ఆ విషయాలని తెలుసుకుని అప్పటికప్పుడు సంతోషపడుతున్నారు, కానీ కాసేపటి క్రితం దాదాపు ఓ ముగింపు శుభవార్తని సోషల్ మీడియాలోకి మోసుకుచ్చి ఓ ఫోటో జత చేసి మరీ, సమ్మర్ సెలవలు కూడా అయిపోయాయి దాదాపు చివరి దశకి వచ్చేసాం అని చెప్పేసాడు. మరి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మనకి రాజమౌళి త్వరలోనే ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడనమాట.

(Visited 398 times, 1 visits today)