Home / Entertainment / బాబాయ్-అబ్బాయ్ మధ్య వార్..!

బాబాయ్-అబ్బాయ్ మధ్య వార్..!

Author:

బాబాయ్-అబ్బాయ్ మరో సారి టీజర్ వార్ కి సిద్దమౌతున్నారు అదే తీరున సాగుతామంటున్నారు. వినాయక చవితికి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ చిత్రం టీజర్ విడుదల కానుందని ఆ చిత్ర వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. కాగా జూనియర్ యన్టీఆర్ తాజా చిత్రం టీజర్ కూడా అదే రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే జూనియర్ యన్టీఆర్ తాజా చిత్రం గెటప్ రివీల్ అయింది. కొత్త తరహా గడ్డం తో సూపర్ లుక్ తో కనిపిస్తున్నాడూ యంగ్ టైగర్. అయితే బాలకృష్ణ కొత్త సినిమా ‘డిక్టేటర్’లో ఆయన గెటప్ ఎలా ఉండబోతోందో ఇంకా తెలియ లేదు. అది ఈ
నెల 17న వినాయక చవితి సందర్భంగా విడుదలయ్యే టీజర్ లోనే తెలుస్తుందని అంటున్నారు. ఈ రెండు సినిమాలూ మంచి అంచనాల తోనే వస్తున్నాయి.

అదే రోజున విడుదల కానున్న జూనియర్ కొత్త సినిమా టీజర్ తోనే ఆ మూవీ టైటిల్ కూడా తెలియనుంది. నాన్నకి ప్రేమతో అనుకున్న ఈ సినిమా జూనియర్ “న” ఫ్లాప్ సెంటిమెంట్ (నిన్ను చూడాలని, నాగ, నా అళ్ళుడు, నరసింహుడు) తో మా నాన్నకి ప్రేమతో మార్చారని వినిపించినా ఆ తర్వాత “అభిరాం అనే పేరునీ పరిశీలిస్తున్నట్టు వర్తలొచ్చాయి కానీ ఖచ్చితంగా సినిమా టైటిల్ ఏమిటన్నది తెలియ రాలేదు. ఆ విశయాన్ని ఇంకా సీక్రేట్ గానే ఉంచుతున్నారు. ఇలా బాబాయ్-అబ్బాయ్ లు ఇద్దరూ జనంలో ఆసక్తి రేకెత్తిస్తూ వినాయకచవితికి సందడి చేయబోతున్నారు.

పోయిన సంవత్సరం కూడా బాలకృష్ణ నటించిన ‘లయన్’ టీజర్, జూనియర్ యన్టీఆర్ ‘టెంపర్’ టీజర్ ఒకే రోజున జనం ముందు నిలిచాయి. ఈ రెండూ గత డిసెంబర్ 31వ తేదీ రాత్రి విడుదలై అభిమానులకు నూతన సంవత్సర ఉత్సాహాన్ని అందించాయి. ఐతే ఆ రెండు సినిమాలు అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు యావరేజ్ గా నిలిచాయి. ఎలక్షన్ల వల్ల కొద్ది రోజులు ప్రదర్షణ ఆపేయాల్సి వచ్చి మళ్ళీ రిలీజ్ అయినా రావాల్సినంత క్రేజ్ రాలేదు.

అలాగే ఈ సారి కూడా వినాయక చవితికి జరగనున్న టీజర్ వార్ లో బాలకృష్ణ ‘డిక్టేటర్’, జూనియర్ యన్టీఆర్ కొత్త సినిమా పోటీపడనున్నాయి. ‘డిక్టేటర్’కు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, జూనియర్ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఇద్దరు దర్శకులు తమ హీరోలను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొత్త గెటప్ తో జూనియర్ ఎలా ఉంటాడో తెలిసిపోయింది. ఇక బాలకృష్ణ ‘డిక్టేటర్’లో ఏ గెటప్ లో కనిపిస్తారో తెలియాల్సి ఉంది. వినాయక చవితి రోజున నందమూరి ఫ్యాన్స్ కు ఈ సారి భలే సందడి ఉండనుంది. ‘డిక్టేటర్’గా బాలకృష్ణ గెటప్, జూనియర్ యన్టీఆర్ సినిమా టైటిల్ రెండూ ఆ రోజునే రివీల్ కానున్నాయి. అలాగే ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనూ
పోటీపడతాయని వినిపిస్తోంది. అంతకంటే ముందు టీజర్ వార్ లో ఈ బాబాయ్-అబ్బాయ్ చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం.

(Visited 79 times, 1 visits today)