పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి రాం చరణ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటనుకుంటున్నారా..? తన కొత్త సినిమా ” బ్రూస్లీ టీజర్ ” ని పవన్ బర్ట్ డే కానుకగా విడుదల చేస్తున్నా అని ప్రకటించేసాడు రాం చరణ్ . ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్బంగా పవర్ స్టార్ కొత్త సినిమా “సర్దార్ గబ్బర్ సింగ్” టీజర్ విడుదలై అభిమానులని ఆకట్టుకుంటోంది. పవన్ కొత్త స్టైల్ లో కనిపిస్తున్న ఈ టీజర్ సినిమా సక్సెస్ పక్కా అన్నట్టుంది.ఇప్పుడు ఈ బాబాయ్ కోసం అబ్బాయ్ కూడా తన తరఫున అటు పవన్ కీ ఫ్యాన్స్ కి కూడా గిఫ్ట్ ఇచ్చాడు.
ఇక బ్రూస్లీ విషయానికొస్తే. ఈ అబ్బాయ్ కూడా బాబాయ్ కేం తగ్గలేదు. లవ్ అండ్ సెంటిమెంత్ సీన్లతో తయారైన ఈ టీజర్. సినిమా పై ఆసక్తి పెంచేలా ఉంది. స్టంట్ మాస్టర్ బ్రూస్లీ పంచ్ ఈ సారి అదిరి పోయేలాగే అనిపిస్తోంది.త్వరలో రాబోయే ఈ రెండి సినిమాలూ. సక్సెస్ అవాలని మెగా పవర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.