Home / Inspiring Stories / భూమిలో 3 రోజులు పాతిపెట్టినా బ్రతికి బయటపడ్డ శిశువు.

భూమిలో 3 రోజులు పాతిపెట్టినా బ్రతికి బయటపడ్డ శిశువు.

Author:

దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్ లోని ఒక టింబర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు ఒక పసికందు ఎడుపు వినిపించింది. ఎడుపు ఎక్కడినుంచి వస్తుందా అని వెతుకుతున్న వారికి ఆ ఏడుపు శబ్దం భూమి లోనుండి వస్తుండడంతో చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడ త్రవ్వి చూడగా ప్రాణాలతో ఉన్న పసికందు కనిపించాడు. వెంటనే ఆ శిశువు ఎవరి బిడ్డ అని అడుగగా అదే ఫ్యాక్టరీలో పనిచేసే ఒక యువతి ఆ శిశువు తన బిడ్డే అని ముందుకొచ్చింది. కన్నతల్లే తన పసికందుని చంపడం కొరకు ఇలా పాతిపెట్టిందని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Baby pulled alive from shallow grave three days after

3 రోజుల క్రితం ఆ శిశువుకి జన్మనిచ్చిన ఆ యువతి, ఈ బిడ్డ గురించి తెలిస్తే తన తల్లితండ్రులు అగ్రహిస్తారని ఎలగైనా ఆ శిశువుని వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే తను పని చేస్తున్న ఫ్యాక్టరీ పరిసరాల్లో ఆ పసిగుడ్డుని సజీవంగా పూడ్చిపెట్టింది. కాని దేవుడి దయ వల్ల ఆ శిశువుకి ఏమి జరగలేదు కాని ఆ బిడ్డ మూడు రోజుల తరువాత ఏడవడం మొదలు పెట్టడంతో, ఆ ఏడుపు విన్న మిగతా కార్మికులు ఆ బిడ్డను రక్షించి దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఈ దుశ్యర్యకు పాల్పడిన ఆ యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

(Visited 2,453 times, 1 visits today)