Home / Entertainment / హాలీవుడ్ బిగ్గీస్ లో చోటు సంపాదించిన బాహుబలి..!

హాలీవుడ్ బిగ్గీస్ లో చోటు సంపాదించిన బాహుబలి..!

Author:

ఇండియన్ సెల్యులాయిడ్ అద్బుతంగా అందరి మన్ననలూ పొందుతున్న బాహుబలి అద్బుత విజయం గురించి తెలిసిందే. బాలీవుడ్ లోనూ దుమ్ము రేపిన అమరేంద్ర బాహుబలి.ఇప్పుడు హాలీవుడ్ లోనూ దుమారం లేపుతున్నాడు.  తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజయి బాక్స్ ఆఫీస్ రికార్దులనూ ఊదిపారేసింది.తాజా రికార్డేమిటంటే యూఎస్ లో కూడా బాహుబలిదే హవా అట యూఎస్ లో గత వారం నుంచీ ఇప్పటి వరకూ హాలీవుడ్ బిగ్గీస్ లిస్ట్ లోనే ఉందట. పూర్త్ స్తాయి హౌస్ ఫుల్ల్ కలెక్షన్లతో నడిచే సినిమానే హాలీవుడ్ బిగ్గీస్ లిస్ట్ లో చేరుస్తారు. మన అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవుడూ అక్కడ రెండు వారాలుగా వసూళ్ళు చేస్తూనే ఉన్నారు.. ఇప్పటివరకూ తెలుగు లోనే కాదు పూర్తి భారతీయ చిత్రాలలోనే వారం పైగా నిలబడటం అటుంచి అసలు బిగ్గీస్ లిస్ట్ లోనే ఏ భారతీయ సినిమా చేరలేదు….

ఇక ఆ సంగతటుంచితే బాహుబలి కి సీక్వెల్ గా రానున్న బాహుబలి-2 (బాహుబలి -ద కంక్లూజన్) లో బాలీవుడ్ తారలనీ భాగస్వామ్యం చేస్తున్నారట దర్శకుడు రాజమౌలి. బాహుబలి హిందీ హక్కులను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్  తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటికే అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి కంటే కూడా పార్ట్-2 ని మరింత లాభాలు తెప్పించే దిశగా కొన్ని సూచనలిచ్చారట. అదేంటంటే బాహుబలి రెండో భాగం లో బాలీ వుడ్ తారలనీ తీసుకోబొతున్నారట. ఇప్పటికే ఒక పాత్రకు నిన్నటి తరం అందాల తార శ్రీదేవి ని ఒక పాత్ర కోసం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. బాహుబలి ఇప్పటికే అక్కడి హిట్ బజరంగీ భయిజాన్ తో సమానంగా రన్ అవుతూ 100 కోట్ల రేసులో నిలిచిన మొదటి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

(Visited 120 times, 1 visits today)