Home / Latest Alajadi / బ్యాంక్ – ఆధార్ లింక్ అయిందో..లేదో..? ఇలా చెక్ చేసుకోండి.

బ్యాంక్ – ఆధార్ లింక్ అయిందో..లేదో..? ఇలా చెక్ చేసుకోండి.

Author:

ఆధార్ కార్డు మనదేశంలో అన్ని పథకాలకు మూలంగా మారబోతున్న అత్యంత ముఖ్యమైన కార్డు, ఇప్పటికే మనదేశ జనాభాలో దాదాపు 70 కోట్ల మంది ప్రజలు తమ ఆధార్ నెంబర్ ను వివిధ పథకాలకు లింక్ చేసుకున్నారు, బ్యాంకులకూ ఇచ్చారు. మార్చి 31వ తేదీనాటిని అన్ని గుర్తింపు కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది కేంద్రం. ఈ క్రమంలోనే అత్యంత ముఖ్యమైన బ్యాంక్ ఖాతాకు మీ ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవటానికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మీకు రెండు, మూడు బ్యాంక్ ఖాతాలు ఉంటే.. ఏ ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకోవటానికి ఈ కింది విధంగా చేయాలి..

aadhar-bank-link-status-check

వెబ్‌సైట్ ద్వారా:

  • ఆధార్ వెబ్‌సైట్ www.uidai.gov.in లాగిన్ కావాలి /
  • చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్‌పై క్లిక్ చేయండి / అది మరో పేజ్‌లోకి తీసుకెళ్తుంది /
  • అందులో మీ ఆధార్ నెంబర్, సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయండి /
  • మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు OTP వస్తుంది /
  • ఆ OTP ఎంటర్ చేస్తే మీ స్టేటస్ తెలిసిపోతుంది.
  • ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అప్పటికే లింకై ఉంటే.. కొత్త పేజీలో బ్లూ టిక్ చూపిస్తుంది

మొబైల్ ద్వారా :

  • *99*99*1#కు డయల్ చేయండి
  • మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
  • వెంటనే మీ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ వివరాలు చూపిస్తుంది
  • ఆధార్ లింకైన చివరి బ్యాంక్ అకౌంట్ వివరాలను మాత్రమే చూపిస్తుంది
  • ఒకవేళ మీకు ఒకటికి మించి అకౌంట్లు ఉంటే.. నేరుగా ఆయా బ్యాంకులకు వెళ్లి చూసుకోవాల్సిందే.
(Visited 743 times, 1 visits today)