Home / Inspiring Stories / అడుక్కునే వాళ్ళని లక్షాదికారులని చేసిన బ్యాంకు మేనేజర్.

అడుక్కునే వాళ్ళని లక్షాదికారులని చేసిన బ్యాంకు మేనేజర్.

Author:
 5 అడుగుల 6అంగులల ఓ మామూలు బ్యాంకు మేనేజర్ పార్తీబన్, ఎంతో మంది చిరు వ్యాపారులను, యాచకులను లక్షాధికారులను చేసిన ఢిల్లీ లోని ఖానాఘడ్ ప్రాంతపు SBI శాఖ మేనేజర్. రోజూ  మధ్యహ్నం భోజనం కాగానే రోడ్ మీద నాలుగు అడుగులు వేయటం ఆయనికి అలవాటు ,ఆ క్రమంలో పండ్లు అమ్ముకునే వాళ్ళతో చాయ్ వాలాలతో మాటలు కలుపుతుండేవాడు , అక్కడ ఉన్న భిక్షగాళ్ళకి డబ్బులు వేస్తూ ఉండేవాడు, ఒక రోజు భిక్షగాళ్ళ రోజువారి సంపాదనని తెలుసుకొని ఆశ్చర్య పోయాడు, యాచకులకి ,చిరు వ్యాపారులకి రోజువారి సంపాదనకి కొదవలేదని పార్తీబన్ కి అర్ధం అయిపొయింది ,కానీ వారికీ ఉన్న దురలవాట్లు, వ్యసనాల ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల వల్లనే డబ్బులు అన్ని పోగొట్టుకుంటూన్నారని తెలుసుకొని వారిని ఆ వ్యసనాల, వడ్డీ వ్యాపారుల బారి నుండి దూరం చేస్తే వారిని పేదరికం నుండి పేదరికాన్ని నిర్మూలించొచ్చు అని తెలుసుకొని తానో బ్యాంకు మేనేజర్ అని చెప్పకుండా పక్క వీదిలోనే ఉన్న బ్యాంకులో ఖాతా తెరిస్తే ఋణాలు పొందే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు ,మొదట్లో ఎవరూ స్పందించలేదు కానీ పార్తీబన్ రోజూ అదే విషయం ప్రస్తావించటంతో ,ఒకసారి ప్రయత్నించి చూస్తే పోలా అనుకున్నారు,అదే వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులని తీసుకొచ్చింది. ఒకరోజు 10 మంది గుంపుగా వచ్చిన యాచకులు బ్యాంకులో పార్తీబన్ ని చూసి ఆశర్యపోయారు ,ఖాతా తెరవటానికి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు లేకున్నా తానే సొంత పూచీతో వాళ్ళకి అకౌంట్లు ఇప్పిచ్చి ,బ్యాంకు లావాదేవీల గురించి క్షుణ్ణంగా వివరించాడు. అలా కొద్ది రోజులలోనే ఒకరిని చూసి ఒకరు 1000 కి పైగా ఖాతాలు తెరిచారు ……
ఓ నీళ్ళ పాకెట్లు అమ్ముకునే కుర్రవాడు పార్తీబన్ ఢిల్లీ నుంచి చెన్నయ్ ట్రాన్స్ఫర్ అయ్యేలోపు 3 లక్షలకు పైగానే జమ చేసుకున్నాడు ,నా సలహా విని ఓ మామూలు కుర్రోడు లక్షాధికారి కావటం కన్నా నాకు ఆనందం ఏముందని పార్తీబన్ అంటాడు. ఇలాంటి కుర్రవాళ్ళు ,వడ్డీ లు తీసుకోకుండా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన అక్కడి చిరు వ్యాపారులు అంటా పార్తీబన్ చలవే అని చెప్పుకుంటారు. కానీ పార్తీబన్ మాత్రం నవ్వుతూ సగటు మనిషిగా నా భాద్యత నేను నిర్వర్తించాను అంటాడు. ఇలాంటి బ్యాంకు మేనేజర్లు ప్రతీ ఊరికీ అవసరమే కదూ.

(Visited 3,752 times, 1 visits today)