బతుకమ్మ ఉత్సవాలు దక్షిణాఫ్రికా రాజధాని జొహ్యానెస్బర్గ్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా ఫోరం(TASA) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ,దసరా ఉత్సవాలతో జొహ్యానెస్బర్గ్ నగరం పులకించిపోయింది.
రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ.. బొడ్డెమ్మలు ఆడారు మహిళలు. బతుకమ్మ సంబురాల్లో 1700 నుంచి 2000 మంది వరకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా TASA సభ్యులు మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను లో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం గొప్పగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవహారాలను విదేశాలకు పరిచయం చేయించడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషధారణకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవహారాలను విదేశాలకు పరిచయం చేయించడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషధారణకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు.