Home / Inspiring Stories / రైలులో 50 రూపాయల భోజనాన్ని 90 రూపాయలకు అమ్ముతున్నారు.

రైలులో 50 రూపాయల భోజనాన్ని 90 రూపాయలకు అమ్ముతున్నారు.

Author:

ప్రపంచంలోనే అన్నింటికన్న పెద్ద రైల్వే, మన ఇండియన్ రైల్వే దానికి తగ్గట్లుగానే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మోసపోతుంది కూడా మన ఇండియన్ రైల్వే ప్రయాణికులే అని రుజువు చేసే సంఘటణ ఒకటి బయటపడింది. రిటైర్డ్ ఐఎఎస్ శివేంద్ర కె సిన్హా గారు గత వారం యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించారు. భోజనం సమయానికి రైలులోని పాంట్రీ కారు క్యాటరింగ్ సిబ్బంది భోజనాలకు ఆర్డర్లు తీసుకుంటుండగా శివేంద్ర ఒక వెజ్ భోజనం ఆర్డర్ ఇచ్చి ధర కనుక్కొగా 90 రూపాయలు అని బదులిచ్చాడు ఆర్డర్ రాసుకున్న వ్యక్తి. దీన్ని సందేహించిన శివేంద్ర మెను కార్డు తీసుకురావాల్సిందిగా క్యాటరింగ్ సిబ్బందిని కోరాడు కాని అలాంటి కార్డు ఏదీ ఉండదని మేము చెప్పిన రేటే ఫైనల్ అని వాధించారు క్యాటరింగ్ సిబ్బంది.

కాని పట్టువదలని శివేంద్ర తన భోజనం వచ్చేలోపు తన ఫోన్ లో ఐఆర్సిటిసి వెబ్ సైట్ నుండి పాంట్రీ కార్లలో అమ్మాల్సినా ఆహార పదార్ధాల రేట్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇండియన్ రైల్వే నిభందనల ప్రకారం రైలులో శాకహార భోజనం 50 రూపాయలకే అమ్మాలని అందులో ఉంది. అంతే కాకుండా మాంసహార భోజనం కూడా 55 రూపాయలకే అమ్మాలి కాని అదే రైలులో 100 రూపాయలకు అమ్ముతున్నారని గమనించాడు శివేంద్ర. ఇదే విశయాన్ని తనకు శాఖహార భోజనం తెచ్చిన వ్యక్తికి తెలిపి 50 రూపాయలే ఇచ్చాడు కాని క్యాటరింగ్ వాడు 90 రూపాయలు ఇవ్వాల్సిందేనని వాధించాడు. దానికి రెండింతలు వాధించిన శివేంద్ర అతనికి వెబ్ సైట్ లో పొందుపరిచిన మెను కార్డుని చూపించాడు దానితో శాంతించిన పాంట్రీ కారు క్యాటరింగ్ సిబ్బంది కొంచెం తగ్గి, సరే 50 రూపాయలే ఇవ్వండి కాని ఈ విశయం ఎవరికి చెప్పోందంటూ శివేంద్ర ను కోరారు. కాని జనహితం కోరుకున్న శివేంద్ర అన్ని భోగీలు తిరిగి ప్రయాణికులందరికి పాంట్రీ కారు క్యాటరింగ్ సిబ్బంది చేస్తున్న మోసాన్ని తెలిపి భోజనాన్ని తక్కువ రేటుకే ఇప్పించాడు. ఇదే విశయాన్ని పాంట్రీ కారు ఇంచార్జ్ ని అడుగగా అతను కూడా పొంతన లేని సమాధానాలు చెప్పాడు, తమకు జరుగుతున్న మోసాన్ని అక్కడే ఉన్న కంప్లైంట్ బుక్ వ్రాసాడు శివేంద్ర.

Railway pantry prices

ఈ సంఘటనను ఫేస్ బుక్ లో రాసిన శివేంద్ర, ప్రతి రోజు భారతీయ రైల్వేలలో దాదాపు 2.5 కోట్ల ప్రయాణీకులు ప్రయాణం చేస్తున్నారని అందులో 0.5% మంది అయిన భోజనానికి అదనంగా ప్రతి ప్లేట్ కు 30 రూపాయలు చెల్లిస్తే పాంట్రీ కారు క్యాటరింగ్ వారికి అక్రమంగా 3,75,00,000 రూపాయలు వస్తుంది. ఇదేమీ తక్కువ మొత్తం కాదు అందుకే వారి చేతిలో మోసపోకుండా సరైన ధర చెల్లించి ప్రతిసారీ బిల్ కోసం ఒత్తిడి చేయాలని తెలిపాడు శివేంద్ర.

(Visited 544 times, 1 visits today)