Home / health / చక్కెర కన్నా బెల్లం వాడటం ఎందుకు మంచిదో తెలుసుకోండి.

చక్కెర కన్నా బెల్లం వాడటం ఎందుకు మంచిదో తెలుసుకోండి.

Author:

ఇంటికి బంధువులు వస్తున్నారా …ఏదైనా స్వీట్ చేసి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే తప్పక బెల్లం తో చేసిన స్వీట్ ని మాత్రమే పెట్టండి. అయ్యో బెల్లం ఏంటి చీప్ గా అనుకుంటున్నారేమో. అసలు దానిలో ఉన్న ఖనిజాల గురించి తెల్సుకుంటే చక్కెర బదులుగా అన్నింటిలో బెల్లమే వాడతారు. బెల్లం గుణాలు అంత గొప్పవి మరి . పూర్వం మన పెద్దవాళ్ళు ఎందుకు మనకంటే బలంగా ఉన్నారంటే దానికి కారణం బెల్లం వాడటం వల్ల అని కూడా చెప్పొచ్చు. చక్కరతో ఎక్కువ కాలొరీలు ఒంటికి పడతాయి కానీ బెల్లం అలా కాదు. అందుకే అందరూ చక్కెర కి బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవాలి. బెల్లం వల్ల లాభాలేంటో క్రింద చదవండి.

uses of bellam

* బెల్లం లో ఐరన్ , కాల్షియం , మెగ్నీషియం , విటమిన్ బి కాంప్లెక్స్ లాంటి ఖనిజాలు చాలా ఎక్కువ. పిల్లలకి బెల్లం పాకం తో ముర్మురాల ఉండలు, నువ్వులు బెల్లం లడ్డులు , పూర్ణాలు, అరిసెలు,పరమాన్నం వంటివి అన్ని బెల్లం తో చేసినవి పెట్టాలి. ఇవి చాలా శక్తి ని , మంచి ఆరోగ్యాన్నిఅందిస్తాయి. చక్కర తయారీ కి రసాయనాలు వాడినట్టు బెల్లం తయారీ కి వాడరు . అందుకే పిల్లలకి చిరుతిండి కి బదులుగా బెల్లం పదార్థాలు పెడితే చాలా మంచిది.
* మీకు ఇన్స్టంట్ ఎనర్జీ కావాలా అయితే ఒక గ్లాస్ నీళ్లలో బెల్లం కరిగించి తాగండి. అలాగే తిన్నాక పొట్టలో చాలా ఉబ్బసంగా ఉందా అయితే తిన్నాక ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వెస్కొని చప్పరించండి చాలా ఉపశమనం కలుగుతుంది .
* పిల్లలు తినడానికి సతాయిస్తున్నారా అయితే రాగి జావ బెల్లం తో కలిపి చేసి, వారికి తాగించండి . అలాగే వారికి బెల్లం తో పరమాన్నం చేసి తినిపించండి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిది .
* ఆడవారు నెలసరి సమస్యలతో బాధపడుతున్నారా అయితే పాలల్లో చక్కెర కి బదులుగా బెల్లం వేసి రోజు తాగితే చాలా వరకు ఆ సమస్య దూరం అవుతుంది.
* అజీర్తి సమస్యలు , ముక్కు దిబ్బడ , పొడి దగ్గుకి కూడా బెల్లం మంచి ఔషధం . బెల్లం పాకం పట్టేటప్పుడు అందులో తులసి ఆకులు వేసి , ఆ పాకం మరిగాక దాన్ని తాగితే ఎంతో ఉపశమనం పొందుతారు.
* ఆయుర్వేదం లో కూడా బెల్లాన్ని చాలా మందుల తయారీలో వాడతారు. ఆ మందుల వాడకం లో ఉపసమనం తో పాటు మనకు శక్తి కూడా వస్తుంది. అందుకే దీన్ని మెడిసినల్ షుగర్ అని కూడా అంటారు.
* పెరుగు బెల్లం కలిపి తింటే ముక్కు కారటం కూడా తగ్గుతుంది .
* బెల్లం వాడటం వల్ల కీళ్ల నొప్పులు కూడా రావు.
* బెల్లం తినటం వల్ల రక్తం లో పేరుకున్న చెడు పదార్థాలు కూడా తొలగిపోతాయి .
* చంటి పిల్లలకి అన్నప్రాసన చేస్తప్పుడు ఖచ్చితంగా బెల్లం తో చేసిన పరమాన్నమే పెడతారు ఎందుకంటే అది శ్రేష్టం మరియు రుచికరం కూడా. మొదటి అన్నం తీయగా ఉండాలి, అని ముందుగా ఇదే పిల్లలకి పెడతారు. రుచి తో పాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా బెల్లం సొంతం. మరి ఇన్ని మంచి గుణాలు ఉన్న ఈ పదార్థాన్ని తప్పకుండా వాడండి.

(Visited 1,025 times, 1 visits today)