Home / Inspiring Stories / ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల కలిగే లాభాలేంటో ప్రతి ఒక్కరికి తెలియజేయండి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల కలిగే లాభాలేంటో ప్రతి ఒక్కరికి తెలియజేయండి.

Author:

ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నారు, మలిదశ ఉద్యమంలో కెసిఆర్, కోదండరాం లాంటి నాయకుల ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, తెలంగాణ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణాని సాధించుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కొట్టాయాలనే తొందరలో విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కి ఎదురయ్యే సమస్యల గురుంచి ఆలోచించలేదు, అప్పటి ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పారు, రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఐదు కాదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పాడు, ఆ మాట ప్రకారమే ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాం అనే హామీ ఇచ్చారు, ఆ మాటలను నమ్మే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్డీయే కూటమికి విజయాన్ని కట్టబెట్టారు.

కేంద్రంలో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా హామీని పెడచెవిన పెట్టింది, అదిగో ఇస్తున్నాం..,ఇదిగో ఇస్తున్నాం అని ఆశలు రేపి చివరికి ఒక ప్యాకెజీని ప్రకటించారు. ఆ ప్యాకెజీని తిరస్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకెజీ ద్వారానే ఎక్కువ లాభం జరుగుతుంది అనే మాయ మాటలు చెప్పి ప్రజలని నమ్మించారు, తమిళనాడులో జల్లికట్టు ఆడటాన్ని నిషేధించినందుకు అక్కడి యువతీ యువకులంతా కలిసి చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ లో శాంతియుతంగా నిరసన తెలియజేసి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్డినెన్స్ ఇచ్చేలా చేసారు, ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా యువకులు జనవరి 26 వ తేదీన వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేక హోదా సాధించేవరకు నిరసన చేయాలనీ ముందుకు కలుగుతున్నారు , వీరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు.

కానీ వీరి పోరాటానికి అడ్డు తగిలేలా కొన్ని శక్తులు పని చేస్తున్నాయి, ప్రత్యేక హోదా వల్ల వచ్చేది ఏమి లేదు అని ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నాయి, అలాంటి వారి మాటలు నమ్మకుండా ఉండాలంటే ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కలిగే ప్రజయోజనాలు ఏంటో ప్రజలందరికి తెలియాలని ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలని మీ కోసం ఆర్టికల్ రూపంలో అందిస్తున్నాం, ఈ విషయాలని అందరికి తెలిసేలా షేర్ చేసి ప్రత్యేక హోదాని సాధిధ్ధాం.

ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు

ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ఇవే:

  •  మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అందించే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90 శాంతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు.
  • ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపులభిస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్మెంట్ లు దక్కితే… పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపీకి తరలివస్తాయి.
  • ప్రత్యేక హోదాతో పెద్ద సంఖ్యలో ప‌రిశ్రమ‌లు వ‌స్తాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు,యువతీ యువకులకు దక్కుతాయి..
  • అంతేగాకుండా పన్నురాయితీలు, ప్రోత్సహకాల వల్ల మనం కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు సగానికి తగ్గుతాయి.
  • ప్రత్యేక హోదా వస్తే ఏపీకి కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది.
  • ప్రత్యేకహోదా పొందిన ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. తద్వారా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి.
  • ఆంధ్ర ప్రదేశ్ కంటే వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేకహోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి.
  • 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుంది.
  • ప్రత్యేక హోదా వల్ల రైతులకు కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి..ఇక వ్యవసాయానికి కావలసిన ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు లాటివి SC –ST కి చెందిన రైతులకి 50 % సబ్సీడీ , మిగిలిన రైతులకి 90 % లోను వడ్డీ మినహాయింపు + 10 % గ్రాంట్ ఇస్తుంది. అంటే దాదాపు ఒకొక్క రైతుకు కనీసం ఏడాదికి 10 వేల వరకు వివిధ రూపాలలో సబ్సీడీ వస్తుంది.
  • కేంద్రానికి ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ సుంకాల ద్వారా ఆదాయంలో సుమారు 60 నుంచి 62 శాతం ఆదాయాన్ని రాష్ట్రానికి నిధులుగా ఇస్తుంది. ఇవి కాక గ్రాంట్లు, రుణాలు కూడా విడిగా వస్తాయి.
  • మామూలు రాష్ట్రాన్నింటికి కలిపి 70 శాతం ఉంటే, హోదా ఉన్న రాష్ట్రాలకు 30 శాతం అందుతుంది. జనాభా శాతాన్ని బట్టి చూస్తే 6 లేదా ఏడు శాతం జనాభా ఉండే హోదా రాష్ట్రాలకు 30 శాతం సాయం వస్తుంది.

ఇప్పటికైనా మేల్కొని కులం, వర్గం అనే గోడలని బద్దలుకొట్టి ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం పోరాటంలో భాగ్యస్వామ్యం అయ్యి ప్రత్యేక హోదాని సాధించండి.

(Visited 1,732 times, 1 visits today)