Home / Reviews / రియల్ స్టోరీ “భైరవగీత”తో ముందుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ హిట్ కొట్టాడా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!

రియల్ స్టోరీ “భైరవగీత”తో ముందుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ హిట్ కొట్టాడా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!

Author:

ఎప్పుడు వివాదాలకు దగ్గరగా ఉండే రామ్ గోపాల్ వర్మ సమర్పణ వచ్చిన సరికొత్త సినిమా “భైరవ గీత”. ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా స్టోరీ ఏంటి? రివ్యూ ఏంటి? హిట్ అయ్యిందా ఫాట్ అయ్యిందా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ ఓ లుక్ వేసుకోండి.

కథ:

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. అలా గతంలో చాలా సార్లు టాలీవుడ్‌లో చూసిన ఓ రొటీన్‌ కథతో వచ్చిన సినిమానే భైరవ గీత. భైరవ (ధనుంజయ), సుబ్బారెడ్డి(బాల రాజ్‌వాడీ) అనే ఫ్యాక్షనిస్ట్‌ దగ్గర పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి.. తన స్థాయికి తగ్గట్టుగా తన కూతురు గీత(ఇర్రా మోర్‌)ను కట్టారెడ్డి (విజయ్‌ రామ్‌) అనే మరో ఫ్యాక్షనిస్ట్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. గీత..భైరవను ప్రేమించటంతో ఇద్దరు ఊరొదిలి పారిపోతారు. విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి, కట్టారెడ్డి.. భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తారు. దీంతో భైరవ, సుబ్బారెడ్డి మీద తిరుగుబాటు చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు.? చిరవకు భైరవ, గీత ఒక్కటయ్యారా? అన్నదే మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

ఫస్టాఫ్‌లోనే హీరోయిన్‌, హీరోను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. అక్కడ హీరోను చంపాలనుకుంటే అతను హీరోయిన్‌తో పారిపోవడం వరకు సినిమా కాస్త నార్మల్‌గానే ఉంది. ఇక ఫస్టాఫ్‌లో మరోవైపు సుబ్బారెడ్డి వ్యక్త్తిత్వం.. మెయిన్‌ విలన్స్‌లో ఒకరైన కట్టారెడ్డి వ్యక్తిత్వం అన్నింటికి ఆవిష్కరించారు. ఇక సెకండాఫ్‌లో అసలు ఎలాంటి సపోర్ట్‌ లేని హీరోకి మిగతా పేదవాళ్లు ఎలాంటి సపోర్ట్‌ ఇచ్చారు. హీరో తల్లి చనిపోయినప్పుడు ఎదురు తిరగాలనుకునే లేనివాళ్లకు హీరో నాయకత్వం వహించడం వంటి సన్నివేశాలున్నాయి. ఈ సన్నివేశాలను దర్శకుడు సిద్ధార్థ ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు.

హీరో, హీరోయిన్‌ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలను రొమాంటిక్‌గా, హాట్‌గా తెరకెక్కించాడు. పాటలను హాట్‌గా తెరకెక్కించడంలో వర్మను మించిన శిష్యుడయ్యాడు సిద్ధార్థ. దర్శకుడు సిద్ధార్థ సినిమాను అనుభవం లేకపోయినా చక్కగానే తెరకెక్కించాడు. అయితే కథలో ఎలాంటి కొత్తదనం లేదు. రొమాంటిక్‌ పాటలు చూడాలనుకునేవారికి కనెక్ట్‌ అయ్యేలా రెండు పాటలున్నాయి. ఇక జగదీష్‌ చీకటి సినిమాటోగ్రఫీ చాలా బావుంది.
నటీనటుల పరంగా చూసే ధనంజయ, ఐరామోర్‌, బాల్‌రాజ్‌వాడి, విజయ్‌ల చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. పాత్రల పరిధి మేర వారు నటించారు. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ బావుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • సినిమాటోగ్రఫి
  • సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :

  • పాత కథ
  • మితిమీరిన వయలెన్స్‌

పంచ్ లైన్:  “భైరవగీత”…కథ కంటే రొమాన్స్ ఎక్కువ

రేటింగ్ :  2.25/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

భైరవ గీత’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)