Home / Inspiring Stories / ఎవరు లేని తనకు చెట్లే కుటుంబం అనుకుని ముప్పై వేల చెట్లని పెంచాడు.

ఎవరు లేని తనకు చెట్లే కుటుంబం అనుకుని ముప్పై వేల చెట్లని పెంచాడు.

Author:

bhaiyalal

అతడి పేరు భయ్యాలాల్ ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఉంటాడు, వయసు అరవై ఏళ్ల పైమాటే. అందరి లానే అతని జీవితం ఆనందంగా సాగుతుండేది, అయితే 2001లో అతని భార్య బిడ్డకి జన్మనిస్తూ మరణించింది. అప్పుడు ఇతడి వయసు 48 ఏళ్లు. తెలిసిన వాళ్లు బంధువులు మళ్లీ పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా వినలేదు, లేకలేక పుట్టిన కొడుకునే జీవితం అనుకుంటూ బ్రతకసాగాడు. ఆ సంతోషమూ అతనికి ఎక్కువ కాలం మిగలలేదు . 2007లో అతని కొడుకు ఏడేళ్ల వయసులో మంచాన పడ్డాడు ఆ తర్వాత 2009లో అనారోగ్యంతో చనిపోయాడు. ఇక అప్పటి నుండీ భయ్యాలాల్ కి బతుకుపై ఆశపూర్తిగా పోయింది. నా అంటూ సొంతంగా మనుషులు లేని ప్రపంచంలో నాకేం పని, ఇక నేను ఇక్కడ బ్రతికి ఏం సాధించాలి అనుకుని చివరికి చనిపోదామనుకునే స్థాయికి వచాడు.

కానీ చివరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు, తనకి ఇన్ని రోజులు బ్రతకడానికి నేల, తిండీ, నీరు ఇచ్చిన ప్రకృతికి ఏదో చేయాలని తపన పడ్డాడు, ఒకప్పుడు ఎందుకీ బతుకు? చనిపోదాం అనుకున్న వ్యక్తి భయ్యాలాల్కి ఇప్పుడు చెట్లు ప్రియనేస్తం.

ఒకరోజు అటుగా వెళ్తూ చిత్రకూట్ లోని బంజరుభూముల్ని చూశాడు, వెంటనే అక్కడి దృశ్యాన్ని చూసి అక్కడ అంతా పచ్చదనాన్ని పరచాలనుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30,000 చెట్లని నాటి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసాడు. అంతే కాదు వాటిని మొక్కల స్థాయి నుండీ పెద్ద పెద్ద వృక్షాలు అయ్యే వరకూ సొంత బిడ్డల్లా చూసుకున్నాడు కూడా , ప్రస్తుతం సొంత ఊరిని కూడా వదిలిపెట్టి ఓ అటవీశాఖ లో కూలీగా పనిచేస్తున్నాడు. అక్కడ పని అయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కొత్త మొక్కలని నాటడం వాటిని కాపలా కాయటం ఇదే అతని పని, అవే ఇతని బిడ్డలు.

మరి ఇలాంటి మహానుభావుడు గురించి మనం తెలుసుకుని కనీసం ఓ పదిమందికి అయినా చెప్పకపోతే ఎలా చెప్పండి, మీరు కూడా ఓ పది మందికి షేర్ చేసి మన సమజానికి ఇతడి గొప్పతనం తెలియచేయండి, మరి రేపటి సమాజానికి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అవసరం కదా …….

(Visited 681 times, 1 visits today)