Home / Reviews / భలే భలే మగాడివోయ్.

భలే భలే మగాడివోయ్.

భలే భలే మగాడివోయ్ bhale bhale mogadivoy movie review

Alajadi Rating

3.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: లావణ్య త్రిపాఠి - మురళీ శర్మ - వెన్నెల కిషోర్ - అజయ్ - శ్రీనివాసరెడ్డి తదితరులు

Directed by: మారుతి

Produced by: బన్నీ వాస్, వంశీ

Banner: గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్

Music Composed by: గోపి సుందర్

కథ: లక్కి (నాని) మొక్కల మీద పరిశోధన చేసే శాస్త్రవేత్త ఇతనికి ఒక సమస్య మతిమరపు. అదికూడా వింతగ ఉండే మతిమరపు. అదేంటంటే ఏదయినా పని చేస్తూ మధ్యలో వేరే పని గుర్తొస్తే మొదటి పని మరిచిపోతాడు. అలా ఇతనికి వచ్చిన పెళ్లి సంబందాలను కూడా మరిచిపోయి కలవకుండా ఉండిపోతాడు. అలాంటి ఒక సందర్భంలో పాండురంగ రావు (మురళి శర్మ) ను కలుస్తా అని చెప్పి మరిచిపోతాడు. దీంతో విసుగు చెందిన పాండురంగ రావు లక్కి మీద కోపంతో ఆ సంబందాన్ని వద్దనుకుంటారు. తరువాత లక్కి ఒకరికి రక్తదానం చెయ్యాలని వెళ్ళి అది మర్చిపోయి ఇంకొకరికి రక్తం ఇస్తాడు అదే సందర్భం లో కలిసిన నందిని(లావణ్య త్రిపాఠి) ని చూఅడగానే ప్రేమిస్తాడు. ఆమె కి తన మతిమరుపు విశయం తెలియ కుండా ఉండటానికి చేసే ప్రయత్నంలో వింత పనులన్నీ చేస్తుంటాడు. ఇలా ఉండగా నందిని తన ప్రేమను తన తండ్రి  ఒప్పుకున్నాడని, వచ్చి ఆయనని కలవమనీ లక్కికి చెప్తుంది. అక్కడికి వెళ్ళిన లక్కి కి ఒక షాక్ షాక్ తగులుతుంది. నందిని మరెవరో కాదు పాండురంగారావు కూతురే. ఇప్పుడు ఆయన్ని ఎలా ఒప్పించాలి? నందిని కి తన లోపం గురించి ఎలా చెప్పాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే.

నటీ నటుల పర్ఫర్మెన్స్: మతిమరుపు పాత్ర చెయ్యాలి అంటే ముఖ్యంగా కావాల్సింది టైమింగ్, అమాయకంగా కనిపిస్తూనే తన టైమింగ్ తో ఈ పాత్రకు ప్రాణం పోశారు నాని. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మామూలు సన్నివేశాల్లో కూడా తన టైమింగ్ తో ప్రేక్షకుల్లో నవ్వు పుట్టించారు నాని. చిత్రం మొత్తం తన భుజాల మీద నడిపించారు. ఈ పాత్ర ఈయనకి సూట్ అవ్వడం కాదు ఈయన కోసమే ఈ పాత్ర అనడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాని ఎన్ని ప్రయోగాలు చేసినా ఇలాంతి పాత్రలు చేయటం అవసరం. లావణ్య త్రిపాఠి , అందం,నటనా రెండూ కావలసిన పాత్ర ఇది రెండింటిని సమపాళ్ళలో బాలన్స్ చేయడంలో లావణ్య త్రిపాటి సక్సెస్ అయ్యారు. ఈ పాత్రని తన నటనతో మరో స్థాయికి తీసుకు వెళ్ళకపోయినా కాని పాత్రకి ఏం కావాలో అది ఇచ్చారు. నాని మరియు లావణ్య మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మురళి శర్మ, హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా బాగా కుదిరారు ఈయన నటనతో చాలా సన్నివేశాలను నిలబెట్టారు. నరేష్, హీరో తండ్రి పాత్ర పోషించారు చాలా సన్నివేశాలలో అయన టైమింగ్ తో నవ్వించారు. సితార మరియు మధుమిత ఉన్నదీ కాసేపే అయినా ఆకట్టుకున్నారు. ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి మరియు వెన్నెల కిషోర్ వారి శైలి టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించారు. అజయ్ పాత్ర కొద్దిసేపే అయినా ఇచ్చిన కాసేపట్లో ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు.

'భలే భలే మగాడివోయ్' మూవీ రివ్యూ

 

సాంకేతిక వర్గం: తెర ముందు చిత్రాన్ని నాని ఈ చిత్రాన్ని మోస్తే తెర వెనుక సాంకేతిక విభాగంలో గోపి సుందర్ ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని మోశారు అనొచ్చు.కామెడీ , రొమాన్స్ , సెంటిమెంట్, యాక్షన్ ఇలా దేనికదే ఒకదానికి ఒకటి తక్కువ కాకుండా తన నేపధ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోసారు. ఈ విభాగంలో ముఖ్యంగా చెప్పాల్సిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీ , చిత్రం ఆసాంతం కలర్ ఫుల్ గా ఉంటుంది. ఇక నాని, లావణ్య మరియు మురళి శర్మ ని చూపించిన తీరు బావుంది. కథ కథనం మాటలు దర్శకత్వం విషయానికి వస్తే కథ చాలా సన్నని కథ ఎంచుకుని బలమయిన కథనం తో మనముందుకి వచ్చారు దర్శకుడు మారుతి , అతని చిత్రాలలో ఇంత మంచి కథనం ఎప్పుడు గమనించలేదు. కాని సెకెండాఫ్ లో చిత్రం సేఫ్ మోడ్ లో కి వెళ్ళిపోయింది ప్రేక్షకుడి ఊహించిందే జరుగుతుంది. మాటలు కూడా చాలా బాగా కుదిరాయి సరయిన టైమింగ్లో సరయిన మాటలతో సినిమా అందంగా తయారైంది. దర్శకత్వం విషయంలో మారుతికి చాలా క్లారిటీ ఉన్నట్టు కనిపించింది ప్రతి పాత్రా చాలా క్లియర్ గా వ్యవహరించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తవహించాల్సింది , సన్నివేశాలను మరింత ఎదిట్ చేసి ఉంటే కొన్ని సీన్లు సాగదీసినట్టు గా అనిపించేది కాదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి దర్శకుడికి కథ మీద ఉన్న నమ్మకం నిర్మాతకు దర్శకుడి మీద ఉన్న నమ్మకం నిర్మాణ విలువల్లో కనిపిస్తుంది..

విశ్లేషణ: ప్రేక్షకుడు నాని పాత్రతో చాలా బలంగా కనెక్ట్ అయిపోతాడు అతని మతి మరపుని కూడా పెద్దలోపం గా కాకుండా హాస్యం తో కలిపి చూపించి డల్ల్ ఫీలింగ్ రాకుండాచేసాడు., ఇక్కడే దర్శకుడు మారుతి తన ప్రతిభ ఏమిటో చూపించాడు.భలే భలే మగాడివోయ్ లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే హీరోకి కి లోపం ఉందని తెలిసినా అతని పాత్ర మీద జాలి కలిగించడానికి ప్రయత్నించకపోవడం. అతని మతిమరుపుని చూపించే  సంఘటనలని రోజువారీ జీవితానికి సంబందించే విశయాలకీ కనెక్ట్ చేయటం వల్ల పెద్దలోపం ఉందనీ, హీరో అతనితో బాటు ప్రేక్షకుడూ బాదగా ఫీలయ్యే సన్నివేశాలేం లేవు. సినిమా మొత్తం హీరో మరిచిపోవడం మీదనే ఉంటుంది ప్రేక్షకుడు చాలా ఉత్సాహంగా తర్వాత ఏం మరిచిపోతాడు దాన్ని ఎలా కవర్ చేస్తాడు అనే దానిమీదే ఉంటాడు. కొన్ని సీన్లలో లాజిక్ లోపించటం,సెకెండాఫ్ లో సినిమాని సేఫ్ మోడ్ లోకి లాగటం లాంటి చిన్న మైనస్ లు ఉన్నా. అవన్నీ పెద్ద లోపాలనిపించవు. మొత్తంగా ఈ సినిమా నానీకి మళ్ళీ బూస్ట్ ప్రేక్షకుడికి రీచార్జ్ ఇచ్చే మంచి సినిమా

(Visited 115 times, 1 visits today)