ఎవరన్నారు? ప్రేమా గీమా లేదని.. ఒక్కసారి ప్రేమించి చూడండి. ప్రేమ పవర్ ఏంటో తెలుస్తుంది. ప్రేమ కోసం రాజ్యాలు వదిలేసినోల్లు, తాజ్ మహల్లు కట్టేసినోల్లు, చివరకు ప్రాణాలే అవలీలగా వదిలేసినోల్లని చూసం. అలాంటి కోవలోకే మరో ప్రేమికుడు వచ్చి చేరాడు. 9 ఏళ్ళ పాటు ఎముకల క్యాన్సర్ తో పోరాడి గత ఏడాది చనిపోయిన భార్య కోరిక మేరకు ఆమె భర్త అద్భుతం చేసి చూపించాడు. అమెరికాకు చెందిన డాన్ జాక్విష్, అతని భార్య బబ్బెట్. ఆయన తన భార్య చనిపోయాక, ఆమె గుర్తుగా అమెరికాలోని విస్కాన్సిస్ నగర హైవే నెం.85కు చుట్టూ 400 ఎకరాల్లో 7 కిలోమీటర్ల మేర పొద్దుతిరుగుడు మొక్కలను నాటారు.ఈ పొద్దుతిరుగుడు విత్తనాలను విక్రయించగా వచ్చే డబ్బులను క్యాన్సర్ కు మందు కనుక్కోవడానికి జరిగే పరిశోధనలకు, పరిశోధనా కేంద్రాలకు దానం చేయాలని బబ్బెట్ కోరిక.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన భార్య కోరిక మేరకు 400 ఎకరాల్లో పొద్దుతిరుగుడు మొక్కలను నాటినట్లు తెలిపారు. అలాగే క్యాన్సర్ ను జయించేందుకు తన భార్య 9 ఏళ్ళలో దాదాపు 22 రకాల చికిత్సలు చేయించుకుందని ఆయన వివరించారు. భార్య చనిపోయిన కారణాలు వెతికి పట్టుకుని అలాంటి దుస్థితి ఇంకెవరికీ రాకూడదనే ఇదంతా చేస్తున్న ఈ ప్రేమికుడి అమర ప్రేమకు జోహర్..