Home / Entertainment / ఒక ‘బిచ్చగాడు’ తెలుగు సినిమాను షేక్ చేశాడు తెలుసా!

ఒక ‘బిచ్చగాడు’ తెలుగు సినిమాను షేక్ చేశాడు తెలుసా!

Author:

ఒకప్పుడు తమిళ్ డబ్బింగ్ సినిమాలు మన దగ్గర రిలీజ్ అయి కలెక్షన్స్ ని దంచుకునేవి, కాని కొన్ని సంవత్సరాలుగా తెలుగులో హిట్ కొట్టే తమిళ్ సినిమాలు తగ్గిపోయాయి, కాని ఈ సంవత్సరం నుండి మళ్లీ తమిళ్ సినిమాల హవా మొదలైంది, నెల కిందట సూర్య నటించిన ’24’ సినిమా తమిళనాడులో కంటే మన దగరే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది, ఆ తరువాత ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా “బిచ్చగాడు” ఒక కొత్త రికార్డు ని నెలకొల్పింది.

Bichagaadu-Movie-Smash-Hit-In-Telugu

కేవలం 50 లక్షలకి మాత్రమే ‘బిచ్చగాడి’ సినిమాని కొని తెలుగులో విడుదల చేశారు, ఏమాత్రం అంచనాలు లేని ఈ సినిమా కేవలం మౌత్ టాక్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది, బ్రహ్మోత్సవం లాంటి పెద్ద సినిమాల పోటీని తట్టుకొని మరి కలెక్షన్స్ సాధించింది, సినిమా హిట్ అవ్వడానికి కంటెంట్ ఉంటే చాలు స్టార్ హీరో అవసరం లేదని మరోసారి ఈ సినిమా నిరూపించింది, దాదాపు 12 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది, 50 లక్షల పెట్టుబడి మీద 12 కోట్లు రావడం అంటే అది మాములు విషయం కాదు, బిచ్చగాడు బ్రహ్మోత్సవం చేసుకోవడం, బ్రహ్మోత్సవం చేసినోడు బిచ్చగాడు కావడం అంటే ఇదే అని నిరూపించింది.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 9,713 times, 1 visits today)