నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో 100 రోజులకు పైగా ఆడియన్స్‌ని అలరిస్తూ వచ్చింది. ఈరొజు తో బిగ్ బాస్ సమరం ముగియబోతోంది. నేడు జరగబోయే ఫైనల్స్ లో టైటిల్ ఎగరేసుకుపోయే కంటెస్టెంట్ ఎవరో తేలిపోనుంది.
ప్రస్తుతం హౌస్ లో ఉన్న తనీష్, కౌశల్, సామ్రాట్, గీత, దీప్తి ఇంటిసభ్యులు గట్టి పోటీదారులే. ఎవరిని తక్కువ అంచనా వేయలేం. ఇక కౌశల్, తనీష్, గీత మాధురి,సామ్రాట్,దీప్తి మధ్య ఇన్ని రోజులు ఎలాంటి రసవత్తరమైన పోటీ జరిగిందో అందరికి తెలిసిందే.
తాజగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ ఫైనల్స్ గురించి కొంత సమాచారం లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఫైనల్స్ లీక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో మరో సంచలన విషయం కూడా ఉంది. ఈరొజు ఫైనల్స్ లో విజేత గీత మాధురి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటింగ్స్ ని బట్టి అయితే కౌశల్ కు తురుగుండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కానీ విజేతని నిర్ణయించేది బిగ్ బాస్ నిర్వాహకులే కాబట్టి ఈ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి విజేత ఎవరో ఓ అంచనాకు రాలేం. అసలైన విజేత ఎవరిని నాని విజేతగా ప్రకటిస్తాడనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉండడం విశేషం.