Home / Entertainment / ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2లో విన్నెర్ కౌశల్‌

‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2లో విన్నెర్ కౌశల్‌

Author:

తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫైనల్ గ్రాండ్ గా ముగిసింది. బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్‌ నిలిచాడు.<\p>

113 రోజులు పాటు సాగిన ఈ షోలో బిగ్ బాస్-2 విన్నర్ ఎవరో తెలిసే ఎపిసోడ్ ఇవాళ థ్రిల్లింగ్ గా జరిగింది. 26 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న ఓవరాల్‌  కంటెస్టెంట్‌ లకు వచ్చాయి.  ఇందులో 12 కోట్ల ఓట్లు ఒక్క కౌశల్‌ కే పడటంతో విజేతగా నిలిచాడు కౌశల్.

కౌశ‌ల్  ఓ సాధార‌ణ మోడ‌ల్‌ గా, సీరియ‌ల్స్ న‌టుడిగా బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి అడుగుపెట్టాడు. కానీ.. అసాధార‌ణ వ్యక్తిత్వంతో కోట్లాది మందిని ప్రభావితం చేశాడు. ప్రధానంగా తన ముక్కుసూటితనం అతనికి కలిసొచ్చింది.

అదే సమయంలో బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఇచ్చే టాస్క్‌ ల్లో కూడా కౌశల్‌ తనదైన ముద్ర వేశాడు. బిగ్‌ బాస్ సుదీర్ఘ జ‌ర్నీలో ఫస్ట్ నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒంట‌రి పోరాటం చేస్తూ.. బిగ్‌ బాస్ గేమ్ షోకే ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కౌశ‌ల్ పేరు దేశ‌విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నోటివెంట వంద రోజులుగా ప‌లుకుతూనే ఉంది. కౌశ‌ల్ ఆర్మీ పేరుతో ప్రత్యేక ఫ్యాన్స్‌  సంఘం ఏర్పడింది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, కాకినాడ‌, రాజ‌మండ్రి లాంటి అనేక ప్రాంతాల్లో కౌశ‌ల్ ఆర్మీ 2కే రన్‌ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే పలు స్వచ్ఛంద కార్యక‍్రమాల్లో పాలు పంచుకుంది.బిగ్ బాస్-2 విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారు పలువురు సినీస్టార్స్.

(Visited 1 times, 1 visits today)