Home / Entertainment / బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన కిరిటీ…!

బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన కిరిటీ…!

Author:

మొదటి సీజన్ తో పోలిస్తే కొంచెం ఎంటెర్టైనమెంట్ తగ్గినప్పటికీ మెల్ల మెల్లగా బిగ్ బాస్ షో ట్రాక్ లోకి వస్తుంది, న్యాచురల్ స్టార్ నాని తన యాంకరింగ్ తో బిగ్ బాస్ షోని అందరికి చేరువయ్యేలా చేస్తున్నాడు,ఎలిమినేషన్ సమయంలో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్న వారిని బట్టి షో ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన కిరిటీ

షోకి అవసరం అనుకున్న వాళ్లని ఆడియెన్సే ఆదుకుంటున్నారు తమ చేష్టలతో విసిగించే వారిని బయటకి పంపించేస్తున్నారు, ఇకపోతే గత వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన దామరాజు కిరీటి ప్రస్తుత ఎపిసోడ్స్ గురించి పలు రకాల కామెంట్స్ చేస్తూ షోకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. కౌశల్ తో కిరీటి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా అతిగా ప్రవర్తించడం వల్లే ఎలిమినెట్ అయ్యాడని అందరికి తెలిసిందే. అయితే తాను కావాలని అలా చేయలేదని అందరూ తనని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు.

టాస్క్ లో భాగంగానే అక్కడి పరిస్థితిని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతూ.. కౌశల్ నాకు చాలా మంచి ఫ్రెండ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. షోలో ఎవరికి తగ్గట్టు వారు ఆడుతున్నారని తెలిపాడు. ఇక చివరగా రోల్ రిడా లేదా అమిత్ బిగ్ బాస్ షోలో విన్ అవుతారని కిరీటి తెలపడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

(Visited 1 times, 1 visits today)