Home / Political / పరీక్షలో పాస్ చేయించమంటే స్టేట్ టాపర్ ని చేశాడు.

పరీక్షలో పాస్ చేయించమంటే స్టేట్ టాపర్ ని చేశాడు.

Author:

“పరీక్షలో పాస్ చేయించమంటే స్టేట్ టాపర్ ని చేశాడు, మా నాన్న అతి తెలివి వల్ల నేను జైలు పాలు కావాల్సి వచ్చింది”. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 2016 సంవత్సరానికి బీహార్ ఇంటర్మీడియేట్  పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన రూబీ రాయ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆనందంలో మీడియా వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకిష్టమైన సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ గురించి కొంచెం చెప్పు అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “పొలిటికల్ సైన్స్ లో వంటల గురించి ఉంటుందని అందుకే ఆ సబ్జెక్ట్ తనకు చాలా ఇష్టం అని” రూబీ చెప్పిన సమాధానానికి దేశం మొత్తం నవ్వుకుంది. ఆ ఇంటర్వ్యూ కాస్త వైరల్ కావడంతో జాగ్రత్త పడిన బీహార్ విద్యా శాఖ ఈ మధ్యనే రూబీకి మళ్లీ పరీక్షలు నిర్వహించింది.

ruby rai cheated in Bihar state exams

రెండోసారి పరీక్షలలో రూబీ వ్రాసిన సమాధానాలకు మతి పోయిన విద్యా శాఖ అధికారులు అసలు రూబీ పరీక్షలు ఎలా పాస్ అయ్యిందో తమకు అర్దం కావట్లేదని, తులసీదాస్ గురించి వ్యాసం రాయమంటే “తులసీదాస్ జి ప్రనామ్” అని మాత్రమే రాసిందని.. దీనిని బట్టి రూబీ అడ్డదారుల్లో మార్కులు సంపాదించింది అని ఆమె పై పోలీస్ కేసు పెట్టి జైలులో వేశారు. ఇంతకీ ఎం జరిగిందని జైలులో ఉన్న రూబీని అడిగితే అసలు విషయం చెప్పింది, సరిగా చదవలేకపోవడంతో ఎలాగైనా పరీక్షలో పాస్ చేపించమని తన తండ్రికి చెప్పానని దానితో అతి ప్రేమ కారణంగా చదువు సరిగ్గా రాకున్న స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఆమె వాపోయింది. ప్రభుత్వం కూడా ఆమె స్టేట్ ఫస్ట్ రావడం కోసం సహకరించిన అధికారులను సస్పెండ్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి కేవలం రూబీని మాత్రమే దోషిగా తేల్చి చేతులు దులుపుకుంది.

Must Read: ఇంత అవినీతా..? 50 లక్షల పనికి 58 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టిన ప్రభుత్వం.

(Visited 5,223 times, 1 visits today)