Home / Uncategorized / ఎవరెస్టుని అధిరోహించిన తెలుగు అమ్మాయి జీవిత చరిత్రపై సినిమా.

ఎవరెస్టుని అధిరోహించిన తెలుగు అమ్మాయి జీవిత చరిత్రపై సినిమా.

Author:

అత్యంత వెనుకబడిన కుటుంబంలో పుట్టి, ఆత్మవిశ్వాసంతో అతి చిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైనా ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన అమ్మాయి మాలావత్ పూర్ణ, 13 సంవత్సరాల 11 నెలల వయస్సులోనే ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి అందరి చేత ప్రశంసలు అందుకుంది, గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో చదువుకుంటూ గిరిజన సంక్షేమ శాఖా అధికారి ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో పర్వతాలని ఎక్కడం నేర్చుకున్న పూర్ణ, కొన్ని రోజులలోనే ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడానికి కావాల్సిన నైపుణ్యనాన్ని సంపాదించింది , తోటి విద్యార్ధి ఆనంద్ కుమార్ తో కలిసి 2014 వ సంవత్సరం మే 25 వ తేదీన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

Malavath-Purna-Biopic-Trailer-మాలావత్ పూర్ణ

మాలావత్ పూర్ణ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన పూర్ణ, ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగింది, ఆమె తల్లిదండ్రుల నేపధ్యం, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల దగ్గరికి మాలావత్ పూర్ణ ఎలా చేరింది, ఆమె ఎవరెస్ట్ పర్వతం అధిరోహించడానికి గాను తీసుకున్న శిక్షణ విషయాలు, ఇలా ప్రతి విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు, ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల అయింది.

రాహుల్ బోసు అనే హిందీ డైరెక్టర్ తనే నిర్మాతగా మారి ఈ సినిమాని తీస్తున్నాడు, రాహుల్ బోసు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ కూడా చేసాడు, మాలావత్ పూర్ణ పాత్రని అదితి అనే అమ్మాయి పోషిస్తుంది, ఈ మధ్య హిందీలో వచ్చిన ఎంఎస్ ధోని, దంగల్ లాంటి బయోపిక్ సినిమాలకి అపూర్వమైన ఆదరణ లభించింది, మన తెలుగు అమ్మాయి జీవితంగా ఆధారంగా ఒక సినిమా రావడం మన తెలుగువాళ్లందరికి గర్వకారణం, ఇప్పటివరకు తెలుగు వ్యక్తుల్లో ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా పూర్తి స్థాయిలో బయోపిక్ సినిమా రాలేదు, మాలావత్ పూర్ణ జీవితం ఆధారంగా వస్తున్న సినిమానే తెలుగు వ్యక్తి బయోపిక్ గా చరిత్రలో నిలిచిపోతుంది.

(Visited 611 times, 1 visits today)