Home / health / చనిపోయిన వాళ్లను మళ్లీ బతికిస్తా౦

చనిపోయిన వాళ్లను మళ్లీ బతికిస్తా౦

Author:

 

పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు. ఇది భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగం. చనిపోయాక కూడా మనిషి తను చేసిన కర్మలని బట్టి ఏదో ఒక రూపం లో ఎక్కడో ఒక చోట మళ్ళీ జన్మిస్తారని మన జనాల నమ్మకం. ఇది నిజమో కాదో కూడా ఎవరికి తెలీదు. కానీ, ఫిలడెల్ఫియాలోని బయోక్వార్క్‌ అనే సంస్థ ఏకంగా చనిపోయిన వాళ్లను మేం మళ్లీ బతికిస్తామని ప్రకటించింది. అయినా చనిపోయిన వాళ్లు మళ్లీ బతికించటం అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మి తీరాలి అంటోంది బయోక్వార్క్‌ సంస్థ. ఇదంతా నిజమేనా? నిజంగా బతిస్తారా అని ఆలోచిస్తున్నారా… ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం.

birth after dead treatment

అసలు చావంటే ఏంటి.. గుండె కొట్టుకోవడం మొదలు, మెదడు పనిచేయడం వరకూ అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవడాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో మెదడు పనిచేయడం ఆగిపోయినా చావుగానే నిర్ణయిస్తారు. ఇలా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేంచేందుకు తాము ఓ పరిష్కారాన్ని కనుగొన్నాం అంటోంది బయోక్వార్క్‌. అంతేకాదు, దక్షిణ అమెరికాకి చెందిన ఓ వ్యక్తిపై వచ్చే6నెలల్లో తాము ప్రయోగం చేయబోతున్నామని కూడా బయోక్వార్క్‌ సీఈవో ఇరా పాస్టర్‌ స్పష్టం చేశారు. రక్తం నుంచి సేకరించిన మూలకణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ జొప్పించడం ద్వారా ఈ ప్రయోగం నిర్వహిస్తారు. మూలకణాలను జొప్పించడమే బయోక్వార్క్‌ నమ్ముతున్న సిద్ధాంతం. అది మొదటి దశ, రెండో దశలో ఆ వ్యక్తి వెన్నెముకలోకి రకరకాల పెప్‌టైడ్లను ఎక్కిస్తారు. ఎంఆర్‌ఐ స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పేషంటును పరిశీలిస్తూ మీడియన్‌ నాడిని లేజర్‌ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా వరుసగా 15 రోజులపాటు చేస్తే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మెదడు మళ్లీ పనిచేయడం మొదలవుతుందని బయోక్వార్క్‌ అంచనా, ఆలోచన.

ఈ పరిశోధనల్లో, ప్రయోగాల్లో హిమాన్షు బన్సల్‌ అనే భారతీయ వైద్యుడిదే కీలక పాత్ర. నిజానికి గత ఏడాది మేలోనే ఈ ప్రయోగాలు చేద్దాం అంకున్నాడట హిమాన్షు. అదీ మనదేశంలోని ఉత్తరాఖండ్‌లో ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన 20 మందిపై ప్రయోగాలు చేస్తా౦, అనుమతివ్వమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు దరఖాస్తు కూడా చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని ఐసీఎంఆర్‌ అనుమతి ఇవ్వలేదు. అయితే హిమాన్షు ప్రతిపాదించిన ప్రయోగాలకు అవసరమైన పెప్‌టైడ్లను సరఫరా చేసేందుకు అప్పట్లోనే బయోక్వార్క్‌ ముందుకు వచ్చింది. అయితే మరో 6 నెలల్లో జరగబోయే ఈ ప్రయోగం యొక్క ఫలితలేలా ఉంటాయో వేచి చూడాల్సిందే. అయితే ఈ ప్రయోగం విజయవంతమైనప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడట. కళ్లు కదపడం లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడట. ఈ చిన్న మార్పు రేపు ఇంకెన్ని మార్పులకి దారి తీస్తుందో? ఇంకెన్ని ఆవిష్కరణలు జరగనున్నాయో.. వేచి చూడాలి.

(Visited 2,960 times, 1 visits today)