తమ్ముడు కళ్యాణ్ నుంచి పవర్ స్టార్ పవన్ వరకూ
నెల్లూర్ వీ ఆర్ సీ కాలేజ్ ఇంటర్ మీడియెట్ ఎగ్జాంస్ జరుగుతున్నాయ్.. కిటికీ పక్కన కూర్చున్న కళ్యాణ్ రాయకుండా ఆగిపోయాడు పక్క వరుసలో ఉన్న ఫ్రెండ్
“రేయ్ ఇదిగో నా పేపర్ లో చూడు”
“సారీరా..! నిన్నంతా ఎగ్జాం కోసమే ప్రిపేర్ అయ్యాను కాపీకొట్టటం ప్రాక్టీస్ చెయ్యలా నువ్ రాస్కో” ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయ్ పోయాడా అబ్బాయ్.
ఇంటికి దగ్గర్లో ఉండే పార్క్ లో కరాటే ప్రాక్టీస్ జరుగుతోంది. “కళ్యాణ్ ఐ లవ్ యూ!” ఒక ఇంటిపక్కనే ఉండే అమ్మాయ్ చెప్పింది. “సారీ…! ప్రాక్టీస్ లో ఉన్నా ఐపొయాక..కాదు కాదు..! రేపుమార్నింగ్..సారీ.. రేపు సాయంత్రం ప్రాక్టీస్ కి వస్తా కదా అప్పుడు మాట్లాడుకుందాం” గాల్లోకి పంచ్ లు విసురుతూనే చెప్పాడు.
మళ్ళీ ఎప్పుడూ ఆ అమ్మాయ్ పవన్ కళ్యాణ్ వైపు కూడా చూడలేదు.
మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజయ్యాక. “ఏం సినిమారా బాబూ..! మెగాస్టార్ తమ్ముడు కదా ఇరగ దీస్తాడనుకుంటే ఇలాంటి సినిమా తీసాడు.”
మొదటి సినిమా కి ఫ్లాప్ టాక్. ‘కానీ ఆ గుండెల మీద రాళ్ళేంట్రా బాబు అలా కొట్టించేస్కున్నడు సినిమాకోసం అంత రిస్కు తీస్కోవటమేంట్రా ఈడు
మామూలోడు కదు” పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మొదటి సినిమాకే ప్రేక్షకుడికి అర్థ మైంది. తనదంటూ ఒక మార్క్ వేసాడు.
“లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్” తెలుగు సినిమాలో పూర్తి ఇంగ్లిష్ పాట ఎక్కడా కృత్రిమత్వం లేదు అసలు ఈ ఇంగ్లిష్ పాటేంటి అని ఎవ్వరికీ అనిపించలేదు. “ఏ దేశ్ హై ప్యారా ప్యారా” తెలుగు సినిమాలో హిందీ పాట ఒక కొత్త ప్రయోగం. అక్కడున్నది కళ్యాణ్ సారీ..! పవన్ కళ్యాణ్ కాకపోయుంటే ఆ ప్రయోగం బెడిసి కొట్టేది.
అప్పటి నుంచీ తెలుగు సినిమాలు రెండు రకాలు ఒకటి సినిమా రెండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా.
“అప్పుడే డైరెక్షనా..? అన్నారు, ఇన్నాళ్ళూ అదే కదా చేసింది డైరెక్టర్నెప్పుడు చేయనిచ్చాడు!? అని ఇంకొందరన్నారు. క్యూట్ లుక్ తీసేసి పక్కా మాస్ లుక్
మామూలు భాషలో ఐతే ఆవారా అని సినీ పండితులు పెదవి విరిచారు. పవన్ కళ్యాణ్ “యాక్షన్” అని అరిచాడు. “జానీ” పవర్ స్టార్ కున్న తిక్కనీ సినిమా విషయం లో అతని లెక్కనీ చూపించింది.తెలుగు సినిమాకి హాలీవుడ్ టచ్ ఇచ్చిన మొదటి సినిమా. కమర్షియల్ జయాపజయాలని పవన్ ఎప్పుడూ నమ్మలేదు నమ్మడు కూడా.
లెట్స్ గో జానీ.. అనుకున్నాడు. అఖిరా కురసోవా అభిమాని డైరెక్టర్ కూడా అయ్యాడు.
ఫైట్ మాస్టర్ గా అన్నయ్య కోసం చేసినా (డాడీ), ఖుషీలో కార్నివాల్ ఫైట్ సొంతగా కంపోజ్ చేసుకున్నా పవర్ స్టార్ లో ఒక ఇంటలిజెంట్ స్టైల్ ఉంటుంది.
బాయి బయ్యే బంగారు రమణమ్మ, కాటమ రాయుడా అంటూ స్టెప్పులేసినా మరో హీరోకి సూటవదేమో గానీ. ఖాలీ దొరికితే లుంగీ కట్టుకొని తోట పని చేసుకునే పవర్ స్టార్ కి పెద్దగా ఇబ్బందుండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సినిమా ఐనా జీవించటం ఐనా నటించటం రాదు జీవించటం తప్ప.
జానీ, గుడుంబా శంకర్, బాలూ ,బంగారం, అన్నవరం ఇలా వరుస కమర్షియల్ ప్లాపులు మద్యలో ఒక హిట్ జల్సా మళ్ళీ కొమరం పులి, తీన్ మార్, పంజా లు మళ్ళీఅదే బాట మామూలుగా ఐతే ఒక హీరో కెరీర్ రిస్క్ లో పడేది కానీ. పవన్ కళ్యాణ్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు. ఆ సినిమాలన్నీ తన క్రేజ్ తోనే నడిచాయన్నది చెప్పల్సిన అవసరం లేదు…
“రాజకీయాలోకి వస్తే ఇన్నాళ్ళూ ఉన్న ఇమేజ్ పోతుంది కెరీర్ మీద కూడా ప్రభావం పడుతుంది” చాలా మందే చెప్పారు అవన్నీ వింటే పవన్ కళ్యాణ్ ఎందుకవుతాడు. నిజమే నాకు రాజకీయాలు తెలియవు వాటినెలా మార్చాలో తెలుసు” అన్నాడు.
మారుస్తాడో మారతాడో తెలీదు గానీ పవన్ ఎప్పుడూ పవనే
కొన్ని సార్లు పవన్ కళ్యాణ్ ఏదైనా చెయ్యటం లేటవ్వొచ్చు కానీ చేయటం మాత్రం పక్కా సెల్యూట్ సర్దార్