Home / health / ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు సరిగ్గా మంచినీళ్లు తాగట్లేరని అర్ధం..!

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు సరిగ్గా మంచినీళ్లు తాగట్లేరని అర్ధం..!

Author:

శరీరానికి నీరు చాలా అవసరం, ఎవరినైనా రోజు ఎన్ని నీళ్ళు తాగుతున్నారు అని అడిగితే చాలా తాగుతున్నాం అని సమాధానమిస్తారు కాని సాధారణంగా ఒకటి లేదా రెండు లీటర్లకు మించి తాగరు. మానవ శరీరం మూడో వంతు నీటితోనే నిర్మితమై నీటిమీదే అధారపడి ఉంటుంది. కాని చాలా మంది శరీరానికి అవసరమైన మరియు అందరికి అందుబాటులో ఉండే నీటిని తాగడానికి శ్రద్ధ చూపరు. శరీరానికి అవసరమైన నీరు సరైన నిష్పత్తిలో అందకపోతే శరీరం కొన్ని సంకేతాలు మనకు పంపుతుంది వాటిని ఆదిలోనే గ్రహించి తగు చర్యలు తీసుకోకుంటే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదం ఉంది. మరి శరీరం మనకు పంపే ఆ సంకేతాలు ఏమిటో క్రింద చదవండి.

body symptoms for dehydration

1. మలబద్దకం
మలబద్దకం బాధిస్తుందంటే అది డీహైడ్రేషన్ కి సంకేతం లా భావించాలి, శరీరంలో తగు నీరు లేకపోవడం వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక మలబద్దకానికి కారణం అవుతుంది.

2. మూత్రం రంగు మారడం
శరీరానికి తగు మోతాదులో నీరు అందకుంటే మూత్రం సాధారణం కంటే ముదురు రంగులో చిక్కగా వస్తుంది. నీరు త్రాగక పోతే ఆ ప్రభావం మూత్ర పిండాలపై కూడా పడి ఆ ప్రాంతంలో నొప్పి వస్తుంది.

3. చర్మం స్థితిస్థాపకత
శరీరానికి నీరు తక్కువైనప్పుడు దాని ప్రభావం చర్మంపై పడుతుంది. దీనివలన చర్మం సాగినట్లుగా, వాడిపోయినట్లుగా మారుతుంది.

4. కండరాలు తిమ్మిరి పట్టడం
శరీరం లోని కండరాలు మరియు ఇతర భాగాలు తిమ్మెర్లు బాగ పడుతున్నాయంటే అది కూడా శరీరంలోని గల తక్కువ నీటి వలననే. శరీరంలో నీరు త్రగ్గడం వలన రక్త ప్రసరణ సరిగ్గా జరగక తిమ్మెర్లు మొదలవుతాయి.

5. తలనొప్పి
తరచు తలనొప్పి బాధిస్తుంటే దానికి ఒక కారణం కూడా శరీరం లోని నీరు కావొచ్చు. డీహైడ్రేషన్ కారణంగా తల బాగా పట్టేసినట్లు ఉండి తలనొప్పి కలుగుతుంది.

6. కీళ్ళనొప్పులు
మనిషి ఆరోగ్యంగా ఉన్నా కూడా కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే దానికి కారణం శరీరానికి సరిపడ నీరు అందకపోవడమే. రోజు సరైన మోతాదులో నీరు తీసుకోనట్లైతే కండరాలకు రక్త ప్రసరణ తగ్గి కీళ్ళ నొప్పులు వస్తాయి.

7. లోబిపి
లోబిపి కి కూడా డీహైడ్రేషన్ ఒక కారణం. శరీరనికి సరైన మోతాదులో నీరు అందకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరిగి గుండె వేగం ప్రభావితమవుతుంది.

శరీరం పైన చెప్పినవి కాక ఇంకా చాల విధాలుగా తనకు మనం తాగే నీరు సపిపోవడంలేదని సంకేతాలు పంపిస్తుంది. మీరు పైన చెప్పిన వాటిల్లో దేనితో ఇబ్బంది పడుతున్నా దానికి ఒక కారణం మీ శరీరానికి అవసరమైన నీరు మీరు త్రాగకపోవడమే.. ఇకనైనా మెల్కోని చాలా నీరు తాగండి.

Also Read: ఈ చిట్కాతో 3 రోజుల్లోనే మీ లివర్ ని శుభ్రం చేసుకోవచ్చు..!

(Visited 15,877 times, 1 visits today)