ఉంగరాల జుట్టు నాజూకు పిల్ల నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రం సూపర్ స్టార్స్ ఎవరూ లేకుండానే కంగన రనౌత్ రేంజ్ ని అమాంతం పెంచింది. తన కెరియర్‌లో ఇంతవరకు సూపర్ స్టార్స్ పై ఆధారపడని కంగన రనౌత్ ఇకపై ఆ అవసరం లేదని అంటోంది. తెలుగు లోనూ ప్రభాస్ పక్కన ఏక్ నిరంజన్ లో నటించిన ఈ బక్క పలచని భామ టాలీవుడ్ లో తన కెరీర్ సరిగ్గా సాగక పోవటం తో తన దృష్తి అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. ఇంట్లో తాను సినిమాల్లోకి రావటం ఇస్టం లేకపోవటం తో ఒంతరిగా వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని మరీ ఈ స్థాయికి వచ్చాననీ అంటోంది కంగణా రనౌత్.
బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ అయిన ఖాన్ త్రయం షారుక్, సల్మాన్, అమీర్‌తో అవకాశం వస్తే బాగుంటుందని కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అనుకునే దాన్నని, కానీ ఇప్పుడు తనకి వాళ్లతో అవసరం ఎంత మాత్రం లేదని, తన సినిమాలపై పెట్టిన ఖర్చుని వెనక్కి తీసుకురాగల సత్తా తనకే వుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది , పెద్ద ఫ్యామిలీస్‌కి చెందిన హీరోయిన్లు పెద్ద సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేశారని, వారు వస్తూనే సూపర్ స్టార్స్ అయ్యారని, కానీ తాను స్వశక్తితో ఎదిగానని గుర్తు చేస్తోంది.
తన తోనే కెరీర్ మొదలు పెట్టిన మిగతా హీరోయిన్లు ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడున్న వారు అక్కదే ఉన్నారనీ , తాను మాత్రం ఏ గాడ్ ఫాదర్లూ లేకుండా నే ఈ రంగం లోకి వచ్చి స్వశక్తి తోనే అటు నటిగా, ఇటు స్టార్‌గా ఎదిగానని ఆమె గర్వపడుతోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసే గుణం వున్న కంగన రనౌత్. ఇంతకుముందెప్పుడూ ఇంత విధ్వంసకర రీతిలో స్టార్స్ గురించి కామెంట్ చేయలేదు. ఇప్పుడు తానే నంబర్‌వన్ హీరోయిన్‌ని అంటూ కంగన రనౌత్ స్వయంగా ప్రకటించుకుంది. ఐతే ఎంత ఎదిగినా కెరీర్ లో ముందు ముందు ఇలాగే ఉండాలీ అంటే మిగతా స్టార్స్ తో మంచి సంబందాలు కలిగి ఉండాలని, ఇలాంటి అనాలోచిత పనులు ఆమె భవిశ్యత్తులో సమస్యలు తేగలవనీ అంటున్నారు బాలీవుడ్ జనాలు.