Home / Entertainment / బాలివుడ్ లో ప్రభాస్ క్రేజ్

బాలివుడ్ లో ప్రభాస్ క్రేజ్

Author:

ప్రభాస్ మిర్చీ త్వరలో రిలీజ్ అవుతొంది. డార్లింగ్ కూడా విడుదలకుసిద్దమౌతోంది. ఆశ్చర్య పోకండి తెలుగులో కాదు హిందీలో. తమిళం, మళయాలం లో ఇప్పటికే కొన్ని సినిమాలు డబ్బింగ్ పూర్తయ్ ప్రదర్షింపబడుతున్నాయ్ కూడా. బాహుబలి దేశవ్యాప్తంగా సృష్టంచిన దుమారం ప్రభాస్ పాత చిత్రాల నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ పెద్ద వరంగా మారింది. బాహుబలి దేశవ్యాప్తంగా అన్ని స్తానిక భాషల్లోనూ డబ్ చేయబడింది (నార్త్ అంతా హిందీ లో) దాంతో ప్రభాస్ నేషనల్ లెవెల్లో అందరికీ పరిచయమైపోయాడు.  ఇప్పుడు ఆ క్రేజ్ ని సొమ్ముచేసుకుంటున్నారు నిర్మాతలు. ప్రభాస్ పాత సిన్మాలన్నీ ఇప్పుడు రకరకాల భాషల్లోకి ఉరుకులు పరుగుల మీద డబ్ చేయబడుతున్నాయి. “దాదా” గా రిలీజ్ ఐన
ఏక్ నిరంజన్ పెద్ద సక్సెస్ కానప్పటికీ ఓ మోస్తరు లాభాలే తెచ్చిందని సమాచారం.

ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలు దాదాపుగా అన్నిఈ మళయలం లోకి డబ్ చేయబడుతున్నాయ్. కేరళ లో మల్లు అర్జున్ గా పిలవబడుతూ అక్కడ యూత్ ఐకాన్ ఐపోయాడు. ఐతే ఈ నెల రోజుల్లోనె ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. “భాహుబలి ఫేం ప్రభాస్ , బాహుబలి బ్యాక్ యాజ్..” అని పోస్టర్లపై ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు.  ఇది కేవలం సినిమాలతోనే ఆగిపోలేదు భాహుబలి లో ప్రభాస్, రానా ల కండలు చూసి అలాంటి బాడీల కోసం జిం ల ముందు క్యూ కడుతున్నారట. ముంబై, కేరళ్ఖ . ” ఈ ఒక్క నెలలోనే మా కస్టమర్లు 20% పెరిగారు అని ఆనందంగా చెప్పారు పాలక్కాడ్ లోని ఒక జిం నిర్వాహకుడూ. బాహుబలి రెండో భాగం  రిలీజయ్యే సరికి వీలైనన్ని భాషల్లో కి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయ్. రెండో భాగం వచ్చేస్తే డబ్బింగ్ సినిమాల మార్కెట్ ఇంకా పెరుగుతుందనీ ఆలోపే అన్ని ఏర్పాట్లూ చేసుకొంటున్నట్టూ సమాచారం. ఇలా భాహుబలి నిర్మాతలకూ నటులకూ, తన సొంత డిస్ట్రిబ్యూటర్లకే కాక, పాత చిత్రాలకూ,  ఫిట్నెస్ సెంటర్లకూ మార్కెట్ పెంచుతోంది.

(Visited 81 times, 1 visits today)