Home / Inspiring Stories / బొమ్మ చూద్దామనుకుంటే దిమ్మ తిరుగుద్ది..!

బొమ్మ చూద్దామనుకుంటే దిమ్మ తిరుగుద్ది..!

Author:

అడల్ట్‌ ప్లేయర్‌.. పేరు చూడగానే టెంప్ట్ అయ్యి డౌన్లోడ్ చేస్తే ఇక మీ స్మార్ట్ ఫోన్ కి మూడినట్టే. మనుషుల బలహీనతలతో చేసే  వ్యాపారానికి నిదర్శణం ఈ యాప్. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లలో వినియోగదారులకు ఇటీవలికాలంలో వలవేస్తున్న ప్రమాదకరమైన యాప్‌ ఇది.

యాప్ adult player app android

ఈ రోజు ప్రతీ ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పని సరి అయ్యింది. నిత్య జీవితం లో మనకు పనికి వచ్చే ఎన్నొ యాప్ లతో జీవితాలు మరింత స్మార్ట్ అవుతున్నాయి. ఐతే ఎంతో ఖరీదైన స్మార్ట్ ఫొన్ లతో కొత్త చిక్కులూ ఉంటున్నాయి.పనికి వచ్చే యాప్ లతో పాటూ మన బలహీనతలతో వ్యాపారం చేసే యాప్ లూ ఎక్కువయ్యాయి. ఎప్పుడో దొంగ చాటుగా చదివే అశ్లీల కథలూ, నగ్న చిత్రాలూ, పోర్న్ వీడియోలూ ఇప్పుడు పదేల్ల పిల్లల చేతిలో కి కూడా వచ్చేస్తున్నాయి. వినియోగ దారులని తప్పు దారి పట్టించి డద్దు దోచుకునే సైబర్ క్రైం లూ పెరిగి పోయాయి. అలాంటి యాప్ లలో ఇప్పుడు వస్తున్న “అడల్ట్ ప్లేయర్” యాప్ కూడా ఒకటి. “అశ్లీల వీడియోలను చూడటానికి” అంటూ ఆకర్షించే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసారా…. ఇక అంతే…! మీ స్మార్ట్ ఫోన్ లోని  సర్వీసులన్నిటినీ నిలిపివేసి,  ఫ్రంట్‌ కెమెరాతో ఆ యూజర్ ఫొటో తీసుకుంటుంది. ఇదంతా వినియోగ దారుని ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఆ తర్వాత.. ఎఫ్‌బీఐ పేరుతో స్ర్కీన్‌పై ఒక మెసేజ్‌ కనిపిస్తుంది. మీరు అశ్లీల చిత్రాలు చూసినందుకు గానీ మీ ఫోన్ ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌లి్‌స్టలో పెట్టామని. ఇలాంటి పనికి గానూ 500 డాలర్లు ( అంటే భారతీయ కరెన్సీ లో దాదాపు రూ.33,000) చెల్లిస్తే గానీ బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించబోమని ఆ మెసేజ్ లో ఉంటుంది. ఇక వినియోగ దారునికి డబ్బు చెల్లించటం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే తాను అశ్లీల వీడియోలు చూసాను అని ఎవరూ బయటికి చెప్పుకోలేరు కదా. సరిగ్గా ఈ పాయింట్ నే సొమ్ము చేసుకుంటారు వాళ్ళు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా మంది నెతిజన్లు ముందు ఆ బలహీణ క్షణాల్లో చేసిన తప్పుకి నాలుక కరుచుకొని గప్‌చు్‌పగా ఆ సొమ్ము కట్టేసి ఫోన్‌ లాక్‌ తీయించుకుంటున్నారు.

జడ్‌ స్కేలర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ పరిశోధక సంస్థ ఈ పోర్న్‌యాప్ చేసే మోసాన్ని మొదటిసారిగా గమనించింది.అనవసరంగా వాళ్లకు డబ్బులు కట్టి మోసపోకుండా ఉండేందుకు గానూ ఫోన్‌ను సేఫ్‌మోడ్‌లో స్టార్ట్‌చేసి, ఈ యాప్‌నకు ఉన్న అడ్మినిస్ట్రేటర్ హక్కులను తీసేసి అన్‌ ఇన్‌స్టాల్‌ చేయవచ్చని జడ్‌ స్కేలర్‌ సూచించింది. చూసారు కదా “రసస్పందన” కలగ్గానే కనిపించిన యాప్ లని ఇన్ స్టాల్ చేసేసుకుంటే ఎన్ని ఇబ్బందులో. కాస్త జాగ్రత్తండోయ్.

(Visited 572 times, 1 visits today)