Home / Entertainment / ట్రైలర్ టాక్: బ్రహ్మోత్సవం.

ట్రైలర్ టాక్: బ్రహ్మోత్సవం.

Author:

Brahmotsavam Trailer బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం సినిమా ఆడియో ఫంక్షన్ ని చాలా ఘనంగా జరిగింది, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు, బ్రహ్మోత్సవం సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేసారు, మహేష్ బాబు రోజు రోజుకి యంగ్ గా మారిపోతున్నట్టుగా కనిపించాడు,వాస్తవానికి ట్రైలర్ చాలా సాఫ్ట్ గా వుంది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్లు పీక్ స్టేజ్ లో వుంటాయని చెప్పారు, కాని ఏవీ ఇంకా ట్రైలర్ లోకి రాలేదు. కాని ట్రైలర్ ని చూస్తుంటే బందువులు అంటే ముందుగా ఇష్టపడకుండా తర్వాత వారి కోసం వెతుక్కుంటూ వెళ్ళే వ్యక్తిగా హీరో క్యారేక్టరైజేషన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కాజల్, సమంత, మహేష్ ల ట్రయాంగిల్ రొమాన్స్ కు మాత్రం చోటు దక్కింది. ట్రైలర్ మొత్తాన్ని చూస్తే మాత్రం కుటుంబ ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఉంది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కుటుంబ కథ చిత్రం తీసిన శ్రీకాంత్ అడ్డాల మరో సారి కూడా అంతకుమించిన ఫ్యామిలీ స్టోరీతో సరికొత్తగా తీసినట్టుగా ఉంది.

ట్రైలర్ లో మెయిన్ హైలెట్ అంటే విజువల్స్, రత్నవేలు తన సినిమాటోగ్రఫీతో ట్రైలర్ మొత్తాన్ని కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు, మిక్కి జే మేయర్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది, మే 20 న సినిమాని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

(Visited 604 times, 1 visits today)