Home / General / బ్రాండ్ ఫ్యాక్టరీ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు కట్టాల్సిందే..!

బ్రాండ్ ఫ్యాక్టరీ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు కట్టాల్సిందే..!

Author:

సినిమా మాల్స్ కి, పెద్ద పెద్ద షోరూంలకి వెళ్ళినప్పుడు పార్కింగ్ ఫీజు వసూలు చేయడం మాములే..కానీ హైదరాబాద్ లో తమ షోరూంకి వచ్చే వినియోగదారుల నుండి ఎంట్రీ ఫీజు వసూలు చేయాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది, దేశవ్యాప్తంగా అనేక బ్రాంచిలు గల ప్రముఖ బట్టల షాపింగ్ మాల్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఈ ఎంట్రీ ఫీజుతో కొత్త సంప్రదాయానికి తెరలేపనుంది.అన్ని రకాల బట్టలపై భారీ డిస్కౌంట్ లు ప్రకటించే బ్రాండ్ ఫ్యాక్టరీ , దేశంలో మరే రిటైల్ సంస్థ చేయని రీతిలో తమ షోరూంలోకి అడుగు పెట్టే వారంతా ఎంట్రీఫీజు కడితేనే అనుమతిస్తామని చెబుతున్నారు. ఈ ప్రవేశ రుసుము రూ.100 నుంచి రూ.200 మద్యలో ఉంటుందంటున్నారు.

బ్రాండ్ ఫ్యాక్టరీ ఎంట్రీ ఫీజు

నవంబరు 22 నుంచి 26 వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించనున్న నేపథ్యంలో కస్టమర్ల రద్దీని తగ్గించటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రూ.5వేల వస్త్రాల్ని కొనుగోలు చేసినవారికి రూ.2వేల వరకు ఆఫర్ ఇవ్వనున్నారు. గిఫ్ట్ వోచర్లు.. క్యాష్ బ్యాక్ అందించనున్నారు. షోరూంలోకి వెళ్లే వినియోగదారులు ఎంట్రీ ఫీజు మొదట్లో కట్టినా.. వస్తువుల్ని కొనుగోలు చేస్తే.. వాళ్ళు కట్టిన ఎంట్రీ ఫీజును బిల్ నుండి డిస్కౌంట్ చేస్తాం అని బ్రాండ్ ఫ్యాక్టరీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఎందుకిలా అంటే.. తాము పెట్టిన భారీ ఆఫర్లకు కస్టమర్లు పోటెత్తుతున్నారని.. ఇలాంటివేళ.. కొనుగోలు చేయటానికి కాకుండా సరదాగా గడపటానికి.. విండో షాపింగ్ కి వచ్చే వారిని, టైమ్ పాస్ చేయడానికి వచ్చేవాళ్ళని తగ్గించుకోవటానికి..అలాగే ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి వచ్చేవాళ్లనే తమ షోరూంలోకి రప్పించుకోవటానికి వీలుగా తాజా ఎంట్రీ ఫీజును ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. డిస్కౌంట్ సేల్ పెట్టినప్పుడు కొనుగోలు చేసేవారికంటే..టైమ్ పాస్ చేయడానికి వచ్చేవాళ్లే ఎక్కువగా రావడం వల్ల భారీగా రద్దీ పెరుగుతుందని దానిని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు, మరి..ఎంట్రీ ఫీజు నిర్ణయం బ్రాండ్ ఫ్యాక్టరీ కి ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి. ఇదే ప్లాన్ సక్సెస్ అయితే.. రానున్న రోజుల్లో భారీ షోరూంలలో పార్కింగ్ ఫీజుతో పాటు ఎంట్రీ ఫీజు కూడా పెట్టేస్తారేమో..?

(Visited 863 times, 1 visits today)