Home / Inspiring Stories / అక్కకి స్కూటీ కొనేందుకు రూ.62000 పాకెట్ మనీ దాచిన తమ్ముడు.

అక్కకి స్కూటీ కొనేందుకు రూ.62000 పాకెట్ మనీ దాచిన తమ్ముడు.

Author:

తోడబుట్టిన వాళ్ళ మధ్య ఎలాంటి ప్రేమలు, ఆప్యాయతలు ఉంటాయో, వారి మధ్య బంధం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో జైపూర్ కి చెందిన యష్ నే 13 ఏళ్ళ కుర్రాడు మరోసారి నిరూపించాడు, దీపావళి పండుగా సందర్భంగా యష్ తన అక్కకి ఒక స్కూటీ కొనిచ్చాడు, అది కూడా తానూ చిన్నప్పటి నుండి దాచుకున్న పాకెట్ మనీతో కావడం విశేషం, అక్కకు ప్రేమతో తమ్ముడు చిల్లర సంచులు మోసుకెళ్లి మరీ షోరూంలో బండి కోసం డబ్బులు చెల్లించాడు. ఈ సంఘటన జైపూర్ లో జరిగింది.

Brother-Gifted-a-scooty-to-sister-with-pocket-money

జైపూర్ లో స్థానికంగా ఉంటూ పిండి మిల్లు నడిపే వ్యక్తి కొడుకైన యష్ 8 వ తరగతి చదువుతున్నాడు, చిన్నప్పటి నుండి తనకి ఇచ్చిన పాకెట్ మనీని అక్క రూపాల్ తో కలిసి ఎంతో జాగ్రత్తగా దాచుకున్న యష్ , ఈ దీపావళి పండుగా సందర్భంగా అక్క రూపాల్ కి ఒక స్కూటీ కొనివ్వాలని అనుకోని అమ్మానాన్నలకు తెలియకుండా తానూ దాచుకున్న రూ.62000 ల చిల్లరనంత సంచులలో తన మామయ్యతో కలిసి తీసుకోని స్థానిక హోండా షోరూంకి వెళ్ళాడు, మొదట ఆ చిల్లర తీసుకోవడానికి నిరాకరించిన సిబ్బంది, యష్ తన అక్క రూపాల్ కోసం స్కూటీ కొనబోతున్నట్లు తెలుసుకొని రెండు గంటల పాటు ఆ చిల్లరని లెక్కించి స్కూటీని ఇచ్చారు. తమ్ముడు చేసిన పనికి అతని తల్లిదండ్రులు, అక్క ఆశ్ఛర్యపోయారు, తోడబుట్టిన వారిమధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకి ఇదొక ఉదాహరణ..!

(Visited 1,660 times, 1 visits today)