Home / Entertainment / బ్రూస్ లీ కథ చెప్పేసారు

బ్రూస్ లీ కథ చెప్పేసారు

Author:

ఈ సంవత్సరం దసరా రేసు లో నిలవబోతున్న సినిమాల్లో మొదటగా వినిపించే పేరు బ్రూస్ లీ. చరణ్ ఫైట్ మాస్టర్ గా కనిపించే ఈ సినిమా పై అంతా ఆసక్తి గానే ఉన్నారు. మెగాస్టార్ తో బాటు నాగార్జున ఇంకా మరికొందరు హీరోలు రియల్ లైఫ్ క్యారెక్టర్లలో కనిపించ బోతున్నారు అనే ప్రచారం ఒక ఎత్తైతే చెర్రీ బబాయ్ ని కూడా రంగం లోకి దించాడనే వార్త ఒకెత్తు. పవన్ చెర్రీ తో కలిసి తెరమీద కనిపిస్తే ఇక మెగా అభిమాను లకి పండగే… “వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!” అన్న చెర్రీ డైలాగ్ ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో పాపులర్ ఐపోయింది. మరి ఇన్ని ఎక్స్పెక్టేషన్ లు ఉన్న సినిమా బయ్యర్లను ఉత్సాహంగ లాక్కొస్తున్న సినిమా కథ ఎలా ఉండ బోతోంది..!?

తాజాగా చెర్రీ నటిస్తున్న బ్రూస్ లీ స్టోరీ లిక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక లీక్ అయిన స్టోరీ ఎంటా అన్నది చూస్తే. ఈ సినిమాలో రాంచరణ్ (బ్రూస్ లీ) ఒక స్టంట్ మాస్టర్ గా దర్శనమిస్తాడని మనకు ముందే తెలుసు.కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది వాస్తవానికి చెరణ్ ఒక సీక్రెట్ పోలీస్. తన అక్క (కృతి ఖర్బంద) అనుకోకుండా కొందరు గుండాల చేతుల్లో మరణిస్తుంది. అయితే ఆమె మరణం మామూలుది కాదనీ దాని వెనుక ఉన్న కారణాలని వెతకటం మొదలు పెట్తిన చరణ్ దీని వెనుక ఒక పెద్ద డాన్ ఉన్నాడని తెలుసుకుంటాడు. దీంతో వారిపై యుద్దం మొదలు పెట్టిన బ్రూస్ లీ ఇక ఆ డాన్ కు సంబంధించి సామ్రాజ్యాన్ని అంచలంచెలుగా పడగొడుతూ డాన్ ని అంతం చేస్తాడట.అసలు ఆ డాన్ బ్రూస్ లీ అక్కను ఎందుకు చంపాడు.!? అనేదే సినిమాలో కీలకమైన ట్విస్ట్. బ్రూస్ లీ ఫైట్ మాస్టర్ గా ఎందుకు మారాడన్నది కూదా సినిమాని పెద్ద మలుపుతిప్పే అంశం అట. రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బ్రూస్ లీ’ టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం ఆడియో ని అక్టోబర్ 16న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆడియో ఫంక్షన్ ని ఘనంగా జరుపుతున్నారు. చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా రానున్నారు. అవకాశ్ముంటే పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చనీ వినిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై వేసుకున్న బ్రూస్ లీ టాటూ ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి తరహా పాత్ర అని అంటున్నారు రచయిత గోపీ మోహన్.

ఈ చిత్రానికి కథ కోన వెంకట్‌, గోపీమోహన్‌ లు అందించగా. మాటలు మాత్రం కోన వెంకట్‌ రాసారు. స్టంట్ మాస్ట్ర్తో ఫైట్లు చేయించేది అణల్‌ అరసు. కాగా ఈ చిత్రానికి మూలకథ అందించిందీ, స్క్రీప్లే, దర్శకత్వంచేస్తున్నదీ శ్రీను వైట్ల.

 

 

 

(Visited 75 times, 1 visits today)