Home / Gossips / ప్రజలకు విజ్ఞప్తి: సారీ.. నిధుల్లేక పని పూర్తిచేయలేకపోతున్నాం… బిల్డర్స్ వింత ప్రకటన

ప్రజలకు విజ్ఞప్తి: సారీ.. నిధుల్లేక పని పూర్తిచేయలేకపోతున్నాం… బిల్డర్స్ వింత ప్రకటన

Author:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మూలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు నిధులు లేక నిలిపివేశామని, చేసిన పనులకు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని ఫ్లెక్సీ పెట్టారు. అటు జనగామ జిల్లా జిడికల్ నుంచి యాదాద్రి జిల్లా మోత్కూర్ వరకు డబుల్ రోడ్డు పనులు ఆగిపోవడంపై కాంట్రాక్టర్ ఫ్లెక్స్ ప్రదర్శించాడు.

పలు జిల్లాల్లో బ్రిడ్జీలు.. రోడ్లు పనుల ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పనులు ఆగిపోయిన కారణాన్ని వివరిస్తూ.. పలుచోట్ల “బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – తెలంగాణ స్టేట్” తరఫున బ్యానర్లు కట్టారు. అందులో.. “ప్రజలకు విజ్ఞప్తి. ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాం.

Builders association of India Telangana state

మేము చేసిన పనులకు ప్రభుత్వం నిధులు చెల్లించనందుకు మిగిలిన పని పూర్తిచేయలేకపోతున్నాం. దీని వల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మాకు బిల్లులు వచ్చిన వెంటనే తిరిగి పని ప్రారంభిస్తాం” అని ఉంది.

(Visited 1 times, 1 visits today)