శ్రీమంతుడుతో కొరటాల శివకు డిమాండ్ బాగా పెరిగింది. ఆల్రడీ ఫస్ట్ ఫిల్మ్ మిర్చి సూపర్ హిట్. సెన్సిబుల్ స్టోరీస్‌ని కమర్షియల్ పంథాలో చెప్పగలడు అని ఈ సినిమాతో నిరూపించుకొన్నాడు కొరటాల. దాంతో అగ్ర హీరోలంతా కొరటాలపై దృష్టి పెట్టారు. చాలా మంది క్యూ కట్టరనే చెప్పొచ్చు. శ్రీమంతుడు తరవాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. అయితే, ఇప్పుడు సడన్‌గా ఎన్టీఆర్ పక్కకు వెళ్లిపోయి, ఆ స్థానంలో బన్నీవచ్చాడని వినికిడి. బన్నీకి కొరటాల ఇది వరకే ఓ కథ వినిపించాడు. అయితే ఎందుకనో అప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.శ్రీమంతుడు విజయంతో కొరటాలపై బన్నీ కి నమ్మకం బాగా పెరిగింది. అందుకే కొరటాలని పిలిచి ‘మనం సినిమా చేసేద్దాం’ అన్నాడట. దాంతో ఈ ప్రాజెక్టు కాస్త ఓకే అయిపోయింది. సుకుమార్ సినిమా పూర్తయ్యే వరకూ ఎన్టీఆర్ ఖాళీ అవ్వడు. ఈలోగా బన్నీ తో సినిమా చేసేద్దామని కొరటాల ఫిక్స్ అయినట్టు సమాచారం. అటు బోయపాటి శ్రీను, ఇటు కొరటాల శివ లతో ఈ రెండు సినిమాల్నీ సమాంతరంగా పూర్తి చేయాలని బన్నీ ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.గమ్మత్తేంటంటే బొయపాటి, కొరటాల ఇద్దరూ దగ్గరి బంధువులె అవ్వడం విశేషం. గతంలో బోయపాటి సినిమాలకు కథ అందించింది ఈ కొరటాలే. ఇప్పుడు అదే ఇద్దరూ ఒకే హీరో తో ఒకేసారి సినిమా చేస్తుండడం నిజంగా విచిత్రమే.