Home / health / మనం వాడే గొట్టపు మాత్రలు మాంసాహారమా ?

మనం వాడే గొట్టపు మాత్రలు మాంసాహారమా ?

Author:

మనకు ఏ చిన్న జబ్బు చేసినా డాక్టర్ ని సంప్రదిస్తాం. ఆ డాక్టరు మనల్ని పరీక్షించి, కొన్ని టాబ్లెట్లు, టానిక్ లేదంటే కాప్సుల్స్ మందులుగా రాసి వాడమంటారు. మనం వాడేసి పారేస్తాం. మనందరం ఇప్పటివరకు ఎన్నో గొట్టపు మాత్రలు వేసుకునే ఉంటాం. సాధారణంగా అల్లోపతీ, ఆయుర్వేదంలో ఈ గొట్టపు మాత్రలు ఎక్కువగా వాడుతారు. ఈ గొట్టపు మాత్ర లోపల అసలు మందు మిశ్రమాన్నినింపుతారు.కానీ పైనుండే ఈ గొట్టపు మాత్ర మాత్రం మాంసాహారమేనట. ఈ కాప్సుల్ లేదా గొట్టపు మాత్రని గెలాటిన్ తో తయారు చేస్తారట. జంతువుల ఎముకలు, కీళ్ళు ఇతర భాగాలను బాగా ఉడికించడం ద్వారా గెలాటిన్ తయారవుతుంది. దీన్ని బట్టి గొట్టపు మాత్ర మాంసమే అని చెప్పొచ్చు. అయితే మాంసాహార తయారీ వల్ల, ఈ గొట్టపు మాత్రలలో రోగకారక వైరస్ లు ఉండే అవకాశాలున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇవి ఎక్కువగా వాడితే కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే ప్రమాదముకూడా ఉందట. అందుకే ఈ గొట్టపు మాత్రలని కూడా ఏ హానీ కలగని పదార్థాలతో తయారు చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు మతపరమైన ఆచారాలను కూడా విశ్వాసం లోకి తీసుకుని, పూర్తి స్టాయి వెజ్ కాప్సుల్ ని తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తు౦దట.

capsule veg or non-veg

మొక్కలు, చెట్లనుంచి తీసిన గుజ్జు లాంటి పదార్తం సెల్యులోజ్ ద్వారా ఈ కాప్సుల్స్ తయారు చేసే విధి విధానాలను, నిబంధనలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఔషధ రంగ నిపుణులకు సూచిoచిదట. ఇందు నిమిత్తం ఔషధ శాఖ ఇప్పటికే ఒక కమిటీని కూడా వేసిందట. అయితే ఎక్కువగా సౌందర్య సాధనాల్లో వాడే ఈ గెలాటిన్ చాలా చవక ధరకే లభిస్తుందట. కానీ మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక ముందు వెజ్ కాప్సుల్స్ తయారీకే కేంద్రం మొగ్గు చూపుతోందట.

(Visited 257 times, 1 visits today)