Home / Inspiring Stories / చల్ ఛలో ఛలో… ‘ స్కై పూల్ ’ సే మిలో …..

చల్ ఛలో ఛలో… ‘ స్కై పూల్ ’ సే మిలో …..

Author:

 

సెంట్రల్ లండన్ లో త్రిశంకు స్వర్గం…

ఆకాశ హర్మ్యాల నడుమ అపర విశ్వామిత్ర సృష్టి

 ఆకాశ వీధిలో అందాల జాబిలి ని అందుకోవాలనుకుంటున్నారా? ఇహ ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు……వెంటనే లండన్ ఫ్లైట్ ఎక్కేయండి…..మీరే కాదు…అక్కడికి చేరుకున్న  తర్వాత, అందాల చందమామను కూడా మీతో పాటుగా సరాగాలు పలికించే మాంచి ఏర్పాటు అక్కడుంది సుమండీ! “  స్కై పూల్ ” పేరిట ప్రపంచంలో జరిగిన తొలి ప్రయోగాన్ని మీరు దగ్గరుండి చూడవచ్చును. రెండు అపార్ట్మెంట్స్ మధ్య న ఏర్పాటు చేసిన ఈ సొగసరి, దళసరి గ్లాసు స్కై పూల్ ఇప్పుడు ప్రపంచ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది…..

 

చల్ ఛలో ఛలో...  ‘స్కై పూల్’ సే మిలో

 

Must Read: ఎవరీ హైదరాబాదీ ? ఏమా కథ?

ఈ స్కై పూల్ సృష్టికర్త, అపర విశ్వామిత్రుడు అయిన బ్యాలీమోర్ గ్రూప్ సి.ఈ.ఓ. సియాన్ ముర్ల్యాన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెపుతున్న మాటలు పర్యాటకులను ఇంకా ఎక్కువగా అలరిస్తున్నాయి. “ సెంట్రల్ లండన్ లో ఆకాశ వీధిలో స్కై పూల్ లో విహారం చేయటం అనేది ఇప్పుడు అత్యద్భుతమైన విషయం” అంటూ సియాన్ ముర్ల్యాన్ చెపుతున్న మాటలు నిజమో కాదో తెలుసుకోవాలంటే, మీరూ వెంటనే లండన్ ఫ్లైట్ వెంటనే ఎక్కేయండి…..త్రిశంకు స్వర్గాన్ని తలదన్నే అద్భుత సృష్టిని తనివితీరా ఆస్వాదించండి…..ఎంబసీ గార్డెన్స్ డెవలప్మెంట్ రెసిడెంట్స్ ఆ రెండు అపార్ట్ మెంట్స్ మధ్య చాలా క్యాజువల్ గా జరిపే స్కై పూల్ విన్యాసాలను మీరూ కంటి నిండా నింపుకోవచ్చును. 

(Visited 92 times, 1 visits today)